‘బంగారు బుల్లోడు’ సినిమా కూడా ఇక ఆన్లైన్లోనేనా..?

ఆగష్ట్ నుండీ థియేటర్స్ ఓపెన్ అయితే.. మొదట కొంచెం మీడియం రేంజ్ సినిమాలను విడుదల చేద్దాం అనుకున్నారు.’ఉప్పెన’ ‘వి’ వంటి సినిమాలతో పాటు అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ సినిమా కూడా ఈ లిస్ట్ లో ఉంది. కానీ ఇప్పుడు మరోసారి వైరస్ మహమ్మారి విజృంభిస్తుంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో థియేటర్లు ఓపెన్ చెయ్యడం కరెక్ట్ కాదు అనే డిస్కషన్ కూడా రన్ అవుతుందని సమాచారం. ఇలాంటి తరుణంలో అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటిటి లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.

‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు. పి.వి.గిరి డైరెక్షన్లో తెరకెక్కిన ‘బంగారు బుల్లోడు’ చిత్రాన్ని.. నిజానికి 3 ఏళ్ళ క్రితం ప్రారంభించారట. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిందట. మధ్యలో మహేష్ బాబు.. ‘మహర్షి’ చిత్రం వల్ల కూడా ‘బంగారు బుల్లోడు’ షూటింగ్ చాలా రోజులు వాయిదా పడిందట.’మహర్షి’ లో అల్లరి నరేష్ గడ్డంతో కనిపించాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. దానికోసం కొన్నాళ్ళు ‘బంగారు బుల్లోడు’ షూటింగ్ ను వాయిదా వెయ్యాల్సి వచ్చిందట.

అయితే అంతా సెట్ అయ్యింది.. ఇప్పుడు రిలీజ్ చేద్దామనుకున్న టైంకి లాక్ డౌన్ ఎఫెక్ట్ పడిందని తెలుస్తుంది. ఇప్పటికే నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రం కోసం 6కోట్ల పైనే బడ్జెట్ పెట్టాడట. ఇంట్రెస్ట్ లతో కలిపి ఇప్పటికే తడిసి మోపుడయ్యిందని సమాచారం. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ నుండీ మంచి ఆఫర్ రావడంతో ఇక ఆన్లైన్ లో విడుదల చెయ్యడమే కరెక్ట్ అని నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు గిరి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus