టాలీవుడ్ లో ఆ నలుగురు అన్న పదం గుర్తుందా….అదే ఆ నలుగురు టాప్ నిర్మాతలు. విషయం ఏమిటంటే….టాలీవుడ్ బడా నిర్మాతల్లో అల్లు ఆరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు ఇద్దరు టాప్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. అయితే వీరిద్దరిపై అనేక ఆరోపణలు అప్పట్లోనే ఉన్నాయి. ఆ ఆరోపణల విషయాన్ని పక్కన పెడితే…ఇప్పుడు సరికొత్త వివాదం, ఆరోపణ ఒకటి తెరపైకి వచ్చింది…అదేమిటంటే….తెలుగు నిర్మాతల మండలి కి అధ్యక్షుడు ఉన్న ఆర్కే గౌడ్ వీళ్ళిద్దరిపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు…ఇంతకీ ఏమయ్యింది, విషయం ఏమిటంటే…ఇంకా ఏడాది కాలం పాటు పదవీ కాలం ఉన్నా ఆర్కే గౌడ్ ను ముందే పంపించేందుకు ఆ ఇద్దరు నిర్మాతలు కుమ్మక్కై ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై ఆర్కే గౌడ్ మాట్లాడుతూ…నేను చిన్న ,మధ్య నిర్మాతలకి మద్దతుగా ఉంటున్నాను. ఏడూ నెలల నుంచీ యూఎఫ్ఓ మీద పోరాటం చేస్తున్నాను.
ఇతర రాష్ట్రాల్లో 3 వేలు వసూలు చేస్తుంటే ఇక్కడ మాత్రం ఏకంగా 11 వేలు వసూలు చేస్తున్నారు. అందుకే ఈ విషయం లో మేము పోరాటానికి దిగాం. కమిటీ వేస్తాం అంటున్నారు గానీ ఇప్పటి వరకూ ఏమీ జరగలేదు ” అని తెలిపాడు. అంతేకాకుండా అల్లూ అరవింద్, సురేష్ బాబు లు యూఎఫ్ఓ లో వాటాలు పెట్టారు, వారికి పెట్టుబడులు ఉండబట్టీ ఈ రకంగా వ్యవపర ప్రయోజనాల కోసం తనను ముందే తప్పించి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మరి చూద్దాం ఈ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో.