‘సైరా’ కథలో అది నిజం కాదట..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రాంచరణ్ ఈ చిత్రాన్ని నిమిస్తున్నాడు. అయితే ఈ చిత్రం కథ పై కొన్ని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అదేంటంటే… బ్రిటీష్‌ సైన్యం పై భార‌తీయులు చేసిన పై మొదటి పోరాటం చేసింది 1857లో జ‌రిగింద‌ని మనం చాలా పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే అంతకు ముందే ఓ తెలుగు వీరుడు బ్రిటీష్‌ సైన్యానికి ఎదురునిలిచాడు. ఆయ‌నే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. చ‌రిత్ర మ‌ర‌చిపోయిన ఈ వీరుడి క‌థ‌ను చూపించడం అంటే మాటలు కాదు.

అయితే ఉయ్యాల‌వాడ నరసింహ రెడ్డి మొదట బ్రిటీష్‌వారి ఆధీనంలో పాలెగాడుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉండేవాడు, ఆయ‌న‌కు, ఓ బ్రిటీష్ అధికారికి జ‌రిగిన గొడ‌వ క్ర‌మంగా పెద్ద‌ది కావ‌డంతో అది పోరుగా దారి తీసింద‌ని కొంతమంది చ‌రిత్ర‌కారులు చెప్పుకొస్తున్నారు. వారి ఉద్దేశం ప్ర‌కారం.. ఉయ్యాల వాడ త‌న సొంత హ‌క్కుల కోస‌మే పోరాడాడు త‌ప్ప‌.. దేశ‌భ‌క్తి ఏమీ కాద‌ని వారు చెబుతున్నారు. అయితే ‘అదంతా అవాస్తవమని.. మొదట స్వాతంత్ర్య స‌మ‌రం కూడా హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కొరకే ప్రారంభ‌మైంద‌ని..ఎవ‌రూ స్వాతంత్ర్యం కావాల‌ని పోరాడ‌లేదని త‌ర్వాత రూపాంత‌రం చెందింద‌ని’ కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా బ్రిటీష్ వారిని ఎదిరించిన మొదటి వీరుడు మ‌న తెలుగువాడే కావ‌డం అతని గొప్ప‌త‌నం అని చెప్పొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus