Allu Aravind: వైరల్ అవుతున్న అల్లు అరవింద్- లావణ్య ల వీడియో.. వరుణ్ తో అప్పుడే ఫిక్స్ అయ్యిందా?

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్ తేజ్…ల ఎంగేజ్మెంట్ రెండు రోజుల క్రితం అంటే జూన్ 9న రాత్రి హైదరాబాద్, మణికొండ లో ఉన్న నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధుమిత్రుల.. సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించారు వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు. వారం రోజులుగా వీరి ఎంగేజ్మెంట్ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతూ వస్తోంది. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కి నాగబాబు తల్లి అంజనా దేవి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , సుస్మిత కొణిదెల , శ్రీజ కొణిదెల, డాక్టర్ వెంకటేశ్వర రావు వంటి వారు హాజరయ్యారు.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వీరి పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇది పక్కన పెడితే… వరుణ్ – లావణ్య త్రిపాఠి ల పెళ్లి గురించి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముందే హింట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో రూపొందిన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య తెలుగులో మాట్లాడింది. దీంతో (Allu Aravind) అల్లు అరవింద్ మైక్ లాక్కుని ‘ఇంత చక్కని తెలుగు మాట్లాడే అమ్మాయిని ఓ మంచి తెలుగబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం’ అని అల్లు అరవింద్ అన్నారు. కాబట్టి లావణ్య.. మెగా వారి ఇంటి కోడలు అవుతుందని ఆయన అప్పుడే హింట్ ఇచ్చారన్న మాట.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus