అఖిల్ సినిమాకి డీసెంట్ ఆఫర్!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సొంతంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ని రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ యాప్ పెద్దగా వర్కవుట్ కానప్పటికీ.. వరుసగా కొత్త సినిమాల రైట్స్ తీసుకొని స్ట్రీమింగ్ చేయడం వలన ‘ఆహా’కి మంచి పేరొచ్చింది. దాదాపు కొత్త సినిమాలన్నీ కూడా తమ యాప్ లో వచ్చేలా చూసుకుంటున్నాడు అల్లు అరవింద్. ఈ మధ్యకాలంలో విడుదలైన ‘క్రాక్’, ‘నాంది’, ‘జాంబీ రెడ్డి’, ‘గాలి సంపత్’ లాంటి సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నాడు. దీంతో ‘ఆహా’ యాప్ కి కొత్త సబ్ స్క్రైబర్స్ బాగా పెరిగారు.

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ‘చావు కబురు చల్లగా’ సినిమా కూడా థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న తరువాత ‘ఆహా’లోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే అల్లు అరవింద్ తను నిర్మిస్తోన్న సినిమాల డిజిటల్ రైట్స్ ని ‘ఆహా’ కోసం మాత్రమే పక్కన పెట్టాలని అనుకోవడం లేదు. డీసెంట్ ప్రైజ్ వస్తే ఇతర ఎంటర్టైన్మెంట్ యాప్స్ తో డీల్ కుదుర్చుకుంటున్నాడు. అఖిల్, పూజా హెగ్డే జంటగా రూపొందించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ అల్లు అరవింద్ ను సంప్రదించగా.. వారిచ్చిన డీల్ కి ఈ ప్రొడ్యూసర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్స్ డీసెంట్ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో అల్లు అరవింద్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా టీజర్, పోస్టర్స్ ఆకట్టుకోవడంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయనున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus