Allu Aravind: రాజమౌళితో ఆ సినిమా చేశానని గర్వంగా చెప్పుకుంటా!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. తెలుగు సినీ సెలబ్రిటీలకు ఆస్కార్ అంటే అందని ద్రాక్ష వంటిదే.

ఇలా ఆస్కార్ వంటి గొప్ప అవార్డు అందుకోవాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇది అసాధ్యమేనని అందరూ భావిస్తూ ఉంటారు కానీ రాజమౌళి మాత్రం అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసి చూపించారు. ఎలాగైనా ఆస్కార్ అందుకోవాలని ఈ చిత్ర బృందం పడిన కృషికి తగిన ఫలితం లభించింది.నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును అందుకొని అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించుకుంది. ఈ విధమైనటువంటి ఒక గొప్ప పురస్కారాన్ని అందుకున్నటువంటి చిత్ర బృందానికి టాలీవుడ్ నిర్మాత మండలి సంఘం నిర్ణయించి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ఎంతో ఘనంగా సత్కరించారు.

ఇక ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ (Allu Aravind) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ… ఆస్కార్ మనకు అందనంత దూరంలో ఉంటుంది. ఈ అవార్డు అందుకోవడం మనకు సాధ్యం కాదు అనే భయంలో అందరూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల క్రితం తాను టికెట్ కొనుక్కొని ఆస్కార్ అవార్డు వేడుకలకు పాల్గొన్నానని,అక్కడికి వచ్చిన వారందరినీ చూసి వీరంతా ఆస్కార్ అందుకుంటారా అని సంబరపడ్డానని తెలిపారు..

కానీ నేడు ఆ వేదికపై రాజమౌళి అండ్ టీం ఆస్కార్ అవార్డును అందుకొని తెలుగు సినిమా గర్వపడేలా చేశారని తెలిపారు. మన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, నా మేనల్లుడు రాంచరణ్, మన లవబుల్ హీరో ఎన్టీఆర్ వీళ్లందరినీ ఆస్కార్ వేడుకలో చూస్తుంటే నా కడుపు నిండి పోయిందని అల్లు అరవింద్ తెలిపారు. ఇక రాజమౌళితో తాను మగధీర సినిమా చేశానని తనతో ఈ సినిమా చేశానని నేను గర్వంగా చెప్పుకుంటానని తెలిపారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus