టాలీవుడ్లో స్టార్ హీరోలు చాలామంది ఉండొచ్చు. బిగ్ 4 అంటే ఠక్కున గుర్తొచ్చేది మాత్రం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌ను ఏలుతున్న నాలుగు స్తంభాలివి. అయితే ఈ నలుగురి రీయూనియన్‌ను ప్రేక్షకులకు చూపించడానికి అల్లు అరవింద్ సిద్ధమవుతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే నలుగురు ఒకేసారి కనిపించకపోయినా.. ఒక సిరీస్‌లో ఉంటారని సమాచారం. బాలయ్య హోస్ట్‌గా ‘ఆహా’లో ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షో అదరగొట్టింది.
దీని రెండో సీజన్ త్వరగా ప్రారంభమవుతుందని ఇటీవల అనౌన్స్ చేశారు. గోపీచంద్ మలినేని సినిమాను బాలయ్య పూర్తి చేసి.. ఈ టాక్ షోకి వస్తారని చెబుతున్నారు. తొలి సీజన్‌కి మించి రెండో సీజన్ ఉండేలా అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని టాక్. దీని కోసం స్టార్ హీరోలు, హీరోయిన్, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తొలి ఎపిసోడ్‌ని చిరంజీవితో చేస్తే అదిరిపోతుందని చూస్తున్నారట.
ప్రస్తుతం టాలీవుడ్లో ఈ వార్తే వైరల్ అవుతోంది. నలుగురు హీరోల్లో అందరితో కలివిడిగా ఉండేది వెంకటేశ్. కాబట్టి బాలయ్య షోకి వెంకీని తీసుకురావడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు. ఇక మిగిలింది చిరంజీవి, నాగార్జున. బాలయ్యతో నాగార్జునకు చిన్నపాటి గొడవ ఏదో ఉందని టాక్ నడుస్తోంది. అయితే ఆ మధ్య ఇద్దరూ ఓ వేదికను పంచుకున్నారు. మరి ఇప్పుడు టాక్ షోకి వస్తారా అనేది చూడాలి. ఇక చిరంజీవికి, బాలయ్యకి మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది.
కానీ నాగబాబు కొన్నిసార్లు దీనిని పర్సనల్‌గా తీసుకొని బాలయ్యను కామెంట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ పక్కనపెట్టేసి ‘అన్‌స్టాపబుల్’లో బాలయ్యతో చిరు, నాగ్, వెంకీ వచ్చి మాట్లాడితే ఆ ఎపిసోడ్లు అదిరిపోతాయి అని చెప్పొచ్చు. మరి అల్లు అరవింద్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవి సఫలం కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ నలుగురి రీ యూనియన్ ఎంతోమంది కనుల పండువగా ఉంటుంది. ఓ తథాస్తు గాడ్.. ఓసారి తథాస్తు అనేయవా.