Allu Aravind: వైరల్ అవుతున్న అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు!

మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఫ్యాన్ బేస్ ను పెంచుకున్న హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అయితే అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. అల్లు అరవింద్ చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎన్నో ఇండస్ట్రీ హిట్లకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి కోట్ల రూపాయల లాభాలను సొంతం చేసుకున్న అల్లు అరవింద్ గతంలో ప్రజలు నన్ను గుర్తించి నా దగ్గరకు వచ్చి మాట్లాడేవారని అన్నారు. అప్పుడు నేను నిర్మించిన సినిమాల గురించి మాట్లాడేవారని ఇప్పుడు పరిస్థితులు మారాయని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం బన్నీ గురించి అడుగుతున్నారని ఆయన వెల్లడించడం గమనార్హం. కొందరు బన్నీ తండ్రిగా నన్ను వాళ్ల పిల్లలకు పరిచయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అలా జరగడం వల్ల తండ్రిగా గర్విస్తున్నానని అల్లు అరవింద్ అన్నారు. అల్లు అర్జున్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాననే విషయంలో మరోసారి గర్వపడుతున్నానని ఆయన కామెంట్లు చేశారు. ఇప్పటికీ అందరం ఒకే ఇంట్లో ఉంటున్నామని ఆయన కామెంట్లు చేశారు. మా మధ్య దాపరికాలు లేవని ప్రతిరోజూ ఒకరితో మరొకరు మాట్లాడుతున్నామని అల్లు అరవింద్ వెల్లడించారు. శాకుంతలం మూవీలో అల్లు అర్హ సినీ ఎంట్రీ గురించి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం ఏప్రిల్ నెలలో థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అల్లు అరవింద్ పుష్ప2 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus