Allu Arha: ఆ పాటకు డ్యాన్స్ చేసిన అల్లు అర్హ.. క్యూట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్స్ విషయంలో అదరగొడుతున్న టాప్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. బన్నీ డ్యాన్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత కఠినమైన స్టెప్స్ అయినా అలవోకగా వేసే బన్నీ ప్రస్తుతం పుష్ప ది రూల్ లో నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీ, స్నేహారెడ్డి కూతురు అల్లు అర్హ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే శాకుంతలం సినిమాలో నటించిన అల్లు అర్హ యానిమల్ సినిమాలోని జమల్ కుడు సాంగ్ కు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. అల్లు అర్హ డ్యాన్స్ స్టెప్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తలపై ప్లేట్ పెట్టుకుని అల్లు అర్హ డ్యాన్స్ చేశారు. అల్లు అర్హ సింపుల్ స్టెప్స్ తోనే అదరగొట్టిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అల్లు అర్హ క్యూట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెబుతుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బన్నీ అభిమానులు మాత్రం అర్హ వీడియోను సోషల్ మీడియా వేదికగా తెగ షేర్ చేస్తున్నారు. అల్లు అర్హ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.

రాబోయే రోజుల్లో అల్లు అర్హ  (Allu Arha) మరిన్ని సినిమాలలో నటిస్తారో లేదో చూడాల్సి ఉంది. అల్లు అర్హ లేటెస్ట్ ఫోటోలు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్హ ఏం చేసినా స్పెషల్ గా ఉంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు. 8 సంవత్సరాల వయస్సులోనే అల్లు అర్హ తన స్కిల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అల్లు ఫ్యాన్స్ అల్లు అర్హను ఎంతో అభిమానిస్తున్నారు.

https://twitter.com/flawsomedamsel/status/1760219327729668528

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus