ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ త్వరలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు నిన్న ప్రకటన వచ్చింది. అది కూడా పౌరాణిక పాత్రలో కావడం విశేషం. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ మూవీలో ‘ప్రిన్స్ భరత’ చిన్నప్పటి పాత్రలో అర్హ కనిపించబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించారు. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. అయితే అర్హ మాత్రమే కాదు గతంలో పౌరాణిక చిత్రాలతో బాల నటులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ లిస్ట్ లో మరో ముగ్గురు ఉన్నారు. వాళ్ళెవరెవరో ఓ లుక్కేద్దాం రండి :
1) రోజా రమణి :
హీరో తరుణ్ వాళ్ళ అమ్మగారు అలాగే సీనియర్ నటి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రోజా రమణి గారు `భక్త ప్రహ్లాద`సినిమాలో ప్రహ్లాద(మేల్) పాత్రని పోషించి మెప్పించారు. ఎస్వీరంగారావు, అంజలి, జయంతి వంటి పెద్ద పెద్ద నటీనటులతో పోటీపడి మరీ ఈమె నటించడం విశేషం.
2)శ్రీదేవి :
అతిలోక సుందరి శ్రీదేవి కూడా బాల నటిగానే కెరీర్ ను ప్రారంభించింది. కోలీవుడ్లో అప్పటి స్టార్ హీరో శివాజీ గణేషన్ నటించిన `కాంధన్ కరునై` చిత్రంలో లార్డ్ మురుగన్(మేల్) పాత్రలో నటించింది శ్రీదేవి.తెలుగులో ‘యశోద కృష్ణ’ అనే పౌరాణిక చిత్రంలో ఈమె కృష్ణుడి చిన్నప్పటి పాత్రని పోషించి ఆకట్టుకుంది.
3)ఎన్టీఆర్ :
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బలరామాయణం’ చిత్రంలో శ్రీరాముని పాత్రని పోషించాడు ఎన్టీఆర్.అంతకు ముందు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన `బ్రహ్మార్షి విశ్వమిత్ర` హిందీ వెర్షన్ లో చిన్నప్పటి భరతుడిగా నటించాడు ఎన్టీఆర్. కానీ ఆ చిత్రం రిలీజ్ కాలేదు.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్