పవన్ గురించి మాట్లాడమంటే, బన్నీ ఏమన్నాడంటే…?

  • January 7, 2020 / 01:15 PM IST

గత రాత్రి యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ వేదికగా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. చిత్ర దర్శక నిర్మాతలు, నటులు పాల్గొన్న ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానులు భారీగా హాజరై కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారు. ఈ ఈవెంట్ చివర్లో హీరో అల్లు అర్జున్ సుదీర్ఘంగా మాట్లాడారు. గ్యాప్ ఇవ్వలేదు… వచ్చింది.. అనే పంచ్ డైలాగ్ తో ప్రారంభించిన బన్నీ, తన నుండి ఏడాదికి పైగా సినిమా రాకపోవడానికి కారణం చెప్పారు. ఐతే అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తున్నావు అన్నా…అని అడిగే వారు అన్నారు.

గతానికి భిన్నంగా అల్లు అర్జున్ తండ్రి అరవింద్ గురించి మాట్లాడుతూ స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి స్థాయికి నేను ఎప్పటికీ ఎదగలేను అన్నారు. 40ఏళ్లకు పైగా నిర్మాతగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు పద్మశ్రీ ఇవ్వాలని.. ఆశించారు. ఐతే బన్నీ స్పీచ్ లో చివర్లో చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఆయన మాట్లాడుతుండగా, పవన్ ఫ్యాన్స్ గోల మొదలైంది. పవన్ గురించి మాట్లాడాలంటూ వారు కేకలు, ఈలలతో రచ్చ మొదలెట్టారు. ఐతే బన్నీ, పవన్ గురించి మాట్లాడాలంటున్నారు, అని చెవుతూ… నేను ఎప్పటికి చిరంజీవి గారి అభిమానినే.. ఈ కట్టె కాలే వరకు అయన అభిమానిగానే ఉంటాను అన్నారు. ఐతే పవన్ గురించి బన్నీ ఏమీ మాట్లాడలేదు.గతంలో ఈ విషయంపై చాలా రచ్చ నడిచింది.ఓ వేడుకలో పవన్ అభిమానుల అత్యుత్సాహం కారణంగా బన్నీ కోపానికి గురయ్యారు. చెప్పను బ్రదర్…అని బన్నీ చెప్పిన ఆ డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్.దీనికి రియాక్షన్ గా పవన్ అభిమానులు కొన్నాళ్ళు యాంటీ బన్నీ క్యాంపైన్ కూడా నడిపారు. తరువాత కొన్ని సంధర్భాలలో పవన్ కి బన్నీ మద్దతుగా నిలవడంతో అందరూ ఒకటయ్యారు. నిన్న కూడా ఇంచు మించు అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఐతే బన్నీ తెలివిగా చిరు గురించి మాట్లాడి..పవన్ ని అవైడ్ చేశారు.

ఇక రజిని కాంత్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం.ఆయన నటించిన దర్బార్ మూవీ బాగా ఆడాలి అన్నారు.మహేష్ సరిలేరు నీకెవ్వరు, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా చిత్రాలకు కూడా బెస్ట్ విశెష్ చెప్పి ప్రసంగం ముగించారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus