Allu Arjun: ‘మంగళవారం’ ట్రైలర్‌ చూశాక సుకుమార్‌ ఇలా అన్నారు: అల్లు అర్జున్‌

  • November 14, 2023 / 11:50 AM IST

‘మంగళవారం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చీఫ్‌ గెస్ట్‌గా వచ్చాడు. ఇది అయిపోయిన న్యూస్‌. అయితే ఈవెంట్‌కి బన్నీ వచ్చేంతవరకు, ఆ తర్వాత మాట్లాడేంతవరకు అందరికీ ఉన్న ప్రశ్నలు ‘అసలు బన్నీ ఎందుకొస్తున్నాడు?’, ‘బన్నీకి ఈ సినిమా టీమ్‌కి రిలేషన్‌ ఏంటి?’ అనే. అయితే వీటికి ఆన్సర్‌ బన్నీ స్పీచ్‌లో దొరికేసింది. ‘నా ఫ్రెండ్‌ కోసమే ఈ ఈవెంట్‌కి వచ్చాను’ అంటూ అల్లు అర్జున్‌ క్లారిటీ ఇచ్చేశాడు. ఆమె ఎవరో కాదు.. ఈ సినిమా నిర్మాత స్వాతి. అవును ఆమె కోసం బన్నీ గెస్ట్‌గా వచ్చాడట.

అందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. నాకు మాత్రం ఆర్మీ ఉంది.. నాపై నాకు నమ్మకం లేనప్పుడు.. ఆ నమ్మకం కలిగించింది ఫ్యాన్స్ మాత్రమేనని ఆ ఫ్యాన్స్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దర్శకుడు అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబోలో వస్తున్న మిస్ట్రీరియస్ డార్క్ థ్రిల్లర్ మూవీ ‘మంగళవారం’.. ఈ శుక్రవారం నాడు థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్.. ఊర మాస్ స్పీచ్‌తో అభిమానుల్ని అలరించారు.

సినిమా గురించి అల్లు అర్జున్‌ ఆసక్తికర విషయాలు చెప్పాడు. సినిమా టీజర్ చూసినప్పుడు షాకయ్యానని, ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయని చెప్పాడు. అజయ్ ఈ కథ చెప్పినప్పుడు మీరు గర్వించే స్థాయిలో సినిమా తీస్తానని అన్నారు. అన్నట్టుగానే ట్రైలర్‌లో ఆ ఫీలింగ్ కనిపించింది అని చెప్పారు. అంతేకాదు ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ సెట్‌లో జరిగిన ఓ విషయం కూడా చెప్పారు. సుకుమార్‌ను టీజర్ చూశావా అని అడిగితే చూడలేదు అన్నారట. దాంతో టీజర్ చూపించారట బన్నీ. టీజర్‌ చూశాక సుక్కు షాక్ అయ్యారట. ఏంటయ్యా షాకిచ్చాడు డైరెక్టరు, చాలా బాగా తీశాడు అని అన్నారట.

ఇక బన్నీ (Allu Arjun) ఫ్రెండ్‌ ఎవరో చెప్పలేదు కదా… ఈ సినిమా నిర్మాత స్వాతినే బన్నీ ఫ్రెండ్‌. ఓసారి స్వాతి బన్నీ దగ్గరకు వెళ్లి సినిమా తీయాలని అనుకుంటున్నాను అని భయపడుతూ చెప్పారట. అప్పుడు బన్నీ ‘ఏదైనా చేద్దాం అని అనుకున్నప్పుడు దూకేయాలి. బురదలో చేయి పెడితే కానీ తెలియదు మనం చేయగలమా లేదా అని. ముందు దూకెయ్ ఆ తరువాత ఈత నేర్చుకో’ అని చెప్పారట.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus