అల్లు అర్జున్ మొదటి సినిమా ఏది అంటే.. టక్కున అందరూ ‘గంగోత్రి’ సినిమా చెబుతారు. మరికొంతమంది అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘డాడీ’ సినిమా పేరు చెబుతారు. ఎందుకంటే ఆ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఓ చిన్న పాత్రని పోషించాడు. ఆ సినిమా కథ మలుపు తిరిగే పాత్రలో బన్నీ కనిపించాడు. అయితే బన్నీ మొదటి సినిమా ఇది కూడా కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే బన్నీ సినీ రంగప్రవేశం చేసాడు అన్న సంగతి బహుశా తక్కువ మందికే తెలిసుండచ్చు.
1985 వ సంవత్సరంలో వచ్చిన ‘విజేత’ చిత్రంతో బన్నీ తెరంగేట్రం చేసాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా బన్నీ కనిపిస్తాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా బన్నీ తండ్రి అల్లు అరవింద్ గారే కావడం విశేషం. దీని తర్వాత కమల్ హాసన్ గారు హీరోగా నటించిన సినిమాలో కూడా బన్నీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. కమల్ హాసన్ మరియు కాశీనాథ్ విశ్వనాధ్ గారి కాంబినేషన్ లో వచ్చిన ‘స్వాతి ముత్యం’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది.
1986 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.ఇది ఓ క్లాసిక్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో కూడా అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. సినిమా స్టార్టింగ్ లో ముసలి వాడైన కమల్ హాసన్ వద్దకు ఆయన కొడుకులు , మనవళ్లు విదేశాల నుండి వస్తారు.అక్కడ వచ్చే ఓ సన్నివేశం లో అల్లు అర్జున్ కనిపిస్తాడు. తన 4 ఏళ్ళ వయసులోనే కమల్ హాసన్ వంటి గొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు బన్నీ.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్