ఆ బయోపిక్ లో అల్లు అర్జున్ నటిస్తున్నాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇతర భాషా చిత్రాల్లో నటించాలని, అక్కడ అభిమానులను ఏర్పరుచుకోవాలని భావిస్తున్నారు. గత రెండేళ్లుగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మలయాళం, తమిళంలో ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని సమాచారం. వివరాల్లోకి వెళితే… టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ని “83 ” పేరుతో కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్ లో ప్రధానంగా 1983 కాలం నాటి భారత్‌ ప్రపంచ కప్‌ తాలూకు సన్నివేశాలను చూపించనున్నారు.

కపిల్‌ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ నటిస్తున్నారు.  ఈ సినిమాలో కపిల్ తో పాటుగా మరో కీలక పాత్ర కూడా ఉందట. ఆ పాత్రే క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్ర.   ఇప్పుడు ఈ పాత్రలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగులోనూ మార్కెట్ చేయాలనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బాలీవుడ్ సినిమాలో బన్నీ నటిస్తున్నాడని వార్తలు రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. నా పేరు సూర్య తర్వాత విక్రమ్‌ కె.కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ విషయం బయటికి వచ్చింది. వీటిలో ఏది వాస్తవమో తెలియాలంటే బన్నీ స్పందించాల్సి ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus