నాగ్ చేసిన కథతోనే 22 ఏళ్ళ తర్వాత బన్నీ చేశాడు… ఆ సినిమా ఏంటంటే..!

  • March 18, 2023 / 02:21 PM IST

ఒకే కథతో.. అనేక సినిమాలు రావడం అన్నది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కథనం అన్నదే ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలగాలి. స్టార్ రైటర్ పరిచూరి గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఏఎన్నార్ చేసిన ‘దేవదాసు’ కథ.. విజయ్ దేవరకొండ చేసిన ‘అర్జున్ రెడ్డి’ కథ ఒక్కటే. కానీ 1953 టైంలో వేదాంతం రాఘవయ్య డైరెక్షన్ కు, 2017 లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ కు ఎంతో తేడా ఉంది. ఆ సినిమాలు విజయవంతం అవ్వడానికి వాటి కథనాలే ముఖ్య కారణం అని చెప్పాలి.

ఈ చిన్న లాజిక్ ను గ్రహించకుండా ఇప్పటికీ చాలా మంది దర్శకులు పొరపాట్లు చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నాగార్జున నటించిన ‘వజ్రం’, అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ లను కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాల కథలు ఇంచుమించు ఒక్కటే. గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన తండ్రికి కొడుకు చేసే చేష్టలు నచ్చవు. రెండు సినిమాల లైన్ అదే. అయితే రెండు సినిమాల్లోనూ హీరో మనస్తత్వం గొప్పది అన్నట్టు చూపించారు.

‘వజ్రం’ లో తండ్రి పెద్ద లెక్కల ప్రొఫెసర్.అందులో మాత్రం కొడుకు ప్రొఫెషనల్ కాదు. కానీ చాలా టాలెంటెడ్. కొత్త కొత్త ప్రయోగాలు చేసి గొప్పోడు కావాలనుకుంటాడు. కానీ తండ్రి అతన్ని గొప్ప లెక్కల ప్రొఫెసర్ ను చేయాలనుకుంటాడు. ‘నా పేరు సూర్య..’లో తండ్రి గొప్ప సైకాలజిస్ట్.. కొడుకు మాత్రం కోపిష్టోడు. చివరి వరకు వీరి మధ్య ఫైట్ జరుగుతూనే ఉంటుంది. బోర్డర్ కు వెళ్లాలని కలలు కనే కొడుకు లక్ష్యానికి తండ్రి వల్ల సమస్యలు వస్తాయి.

ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి ‘ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కదా.. ఇలాంటి సబ్జెక్ట్ లు జనాలకు ఎక్కవు’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే టీవీల్లో మాత్రం ఈ సినిమాలను కొంతమంది ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళు కూడా లేకపోలేదు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus