2024లో టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే విజయాలు నమోదు చేసుకుని, భారతీయ సినిమా స్థాయిని పెంచారు. ఈ సంవత్సరంలో అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas) కలిసి సాధించిన వసూళ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. “కల్కి 2898 AD,” (Kalki 2898 AD), “పుష్ప 2” (Pushpa 2 The Rule) చిత్రాల ప్రభావంతో ఈ ఇద్దరు హీరోలు దేశీయ, అంతర్జాతీయ బాక్సాఫీస్‌ను శాసించారు. జూన్‌లో విడుదలైన ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD” భారీ అంచనాలను అందుకుని, బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లు వసూలు చేసింది.
ఇది ప్రభాస్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. అలానే డిసెంబర్‌లో విడుదలైన “పుష్ప 2” సినిమా నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి, 1600 కోట్లు రాబట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకు, సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకుల నుండి అపారమైన ఆదరణ లభించింది. ఒకే సంవత్సరంలో ఈ ఇద్దరు హీరోల సినిమా వసూళ్లను కలిపి చూస్తే, మొత్తంగా 3000 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ అద్భుత విజయాలు ఈ ఏడాది టాలీవుడ్ స్టామినాను కొత్త దశకు తీసుకెళ్లాయి. అయితే ఈ వసూళ్లను బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కి (Shah Rukh Khan) సంబంధించిన వసూళ్లతో పోల్చితే ఆసక్తికరమైన ఫలితాలు వెలుగుచూశాయి. 2023లో షారూఖ్ ఖాన్ నటించిన “పఠాన్” “జవాన్” (Jawan) మరియు , ‘డంకీ’ (Dunki) చిత్రాలు మొత్తం 2700 కోట్లు వసూలు చేశాయి. “జవాన్” ఒక్కటే 1200 కోట్లు సాధించగా, “పఠాన్” 1100 కోట్లు, “డంకీ” 400 కోట్లు కలెక్షన్లను నమోదు చేశాయి.
బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ కలెక్షన్లు గత సంవత్సరం సంచలనంగా నిలిచాయి. అయితే, ప్రభాస్, అల్లు అర్జున్ వసూళ్లతో 2024లో టాలీవుడ్ బాలీవుడ్‌ను అధిగమించింది. ఈ లెక్కల ప్రకారం, టాలీవుడ్ స్టార్‌లు బాలీవుడ్ సూపర్ స్టార్లతో పోటీ పడడమే కాకుండా, వారిని మించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి విజయాలు టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయంగా మరింత పెంచడం ఖాయం.