Allu Arjun, Ram Charan: ఒకే ప్రేమ్ లో చరణ్ బన్నీ.. చూడటానికి రెండు కళ్ళు చాలవంటూ?

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కుల మతాలకు అతీతంగా ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు కూడా క్రిస్మస్ వేడుకలలో ఎంతో బిజీగా గడిపారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మెగా ఫ్యామిలీ ప్రతి ఏడాది కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే.

ఇకపోతే ఈ ఏడాది కూడా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట చేరి పెద్ద ఎత్తున క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే ఈ ఫోటోలలో ఉపాసన రాంచరణ్ తో పాటు అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఉపాసన రాంచరణ్ ఈ నలుగురు ఓకే ప్రేమ్ లో కనిపించే సందడి చేశారు. క్రిస్మస్ కావడంతో ఉపాసన స్నేహ ఇద్దరు కూడా రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించగా చరణ్ బన్నీ ఇద్దరు కూడా బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించారు.

ఇలా ఈ నలుగురు కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరు స్టార్ హీరోలు సతీసమేతంగా ఒకే ప్రేమ్ లో కనిపించడం చాలా అరుదు. ఇక ఇటీవల కాలంలో అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ కూడా వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ వార్తలకు ఈ ఒక్క ఫోటో చెక్ పడిందని చెప్పాలి.

ఈ విధంగా ఇద్దరి స్టార్ హీరోల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఇలా వీరిద్దరిని ఒకే చోట చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పనులలో బిజీగా ఉండగా (Ram Charan) రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus