Allu Arjun: రెండెకరాల భూమి కొన్న బన్నీ.. అందుకేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకుని వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. తాజాగా ఈ స్టార్ హీరో రెండెకరాల పొలం కొనుగోలు చేశారు. ఈ పొలం రిజిస్ట్రేషన్ కొరకు అల్లు అర్జున్ శంకర్ పల్లి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అల్లు అర్జున్ వచ్చారనే విషయం తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు తహశీల్దార్ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు బందోబస్త్ ను ఏర్పాటు చేయడం గమనార్హం.

రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలంలో ఉన్న జనవాడ గ్రామంలో బన్నీ పొలాన్ని కొనుగోలు చేశారు. బన్నీ కొనుగోలు చేసిన పొలం విలువ కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది. కొంతమంది అభిమానులు బన్నీని కలిసి ఆయనతో ఫోటోలు దిగారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో బన్నీ పొలాలు కొనుగోలు చేస్తుండటం గమనార్హం. పొలం రిజిస్ట్రేషన్ తర్వాత తహశీల్దార్ సైదులు అల్లు అర్జున్ కు ప్రొసీడింగ్ ఆర్డర్ ను అందజేశారు.

బన్నీ ఈ పొలంలో ఫామ్ హౌస్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా పుష్ప పార్ట్1 డిసెంబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. సుకుమార్ పుష్ప సినిమాతో రంగస్థలం సినిమాను మించిన హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus