Allu Arjun: ఆస్ట్రల్ పైప్స్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఒకప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులు ఉండడంతో అల్లు అర్జున్ తమ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించాలని ఎన్నో ప్రముఖ కంపెనీలు ఆయనను సంప్రదిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ ర్యాపిడో, జొమాటో వంటి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి నిర్మాణ సామాగ్రి తయారీ కంపెనీలలో ఒకటైన ఆస్ట్రల్ పైప్స్ లిమిటెడ్ కంపెనీకి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మిస్టర్ కైరవ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ నటన పరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నటుడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లుఅర్జున్ మా బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా మాట్లాడుతూ భారతదేశంలోనే చాలా తొందరగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఒకటైన ఆస్ట్రల్ కంపెనీతో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విధంగా అల్లు అర్జున్ ఒక వైపు సినిమాలలోను, మరొక వైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు. ఇకపోతే ఆయన సినిమాల విషయానికొస్తే పుష్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అల్లుఅర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా చిత్రీకరణలో బిజీ కానున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus