Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Movie News » స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఘనంగా ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ వేడుక

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఘనంగా ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ వేడుక

  • March 10, 2021 / 05:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఘనంగా ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ వేడుక

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వరస విజయాలతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్న బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా చావు కబురు చల్లగా. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తున్నారు. మార్చ్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతుంది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు.

దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ..

‘గీతా ఆర్ట్స్‌తో నా అనుబంధం ఇప్పటిది కాదు. అల్లు అరవింద్ గారు నాకు తండ్రి సమానులు. అలాగే బన్నీ వాసు సోదర సమానుడు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం. గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే చిన్నా పెద్దా అనేది ఉండదు. కథలకు ప్రాధాన్యత ఇస్తూ.. సినిమాను ప్రేమిస్తుంటారు. ఈ సంస్థతో నా బంధం గురించి చెప్పడానికి టైమ్ సరిపోదు. నాకు మాతృ సంస్థ.. గీతా ఆర్ట్స్, GA2 ఎప్పటికీ ఇలాగే చిరకాలం మంచి సినిమాలు నిర్మిస్తూ.. అరవింద్ గారి తర్వాత వాసు గారు.. ఆ తర్వాత బన్నీ గారి బ్రదర్ బాగా ఉండాలి. చాలా గొప్పగొప్ప సినిమాలు చేయాలి వాసు గారు. గీతా ఆర్ట్స్ అక్షయ పాత్ర లాంటిది కౌశిక్. దానికి నిదర్శనం గీతా ఆర్ట్స్. నేను ఆరేళ్ళు అదే కంపౌండ్ లో ఉన్నాను. ఈ అవకాశాన్ని బాగా యూజ్ చేసుకున్నట్లు అనిపిస్తుంది నాకు. నీకు మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ఆల్ ది బెస్ట్. గీతా ఆర్ట్స్ కు మంచి విజయం రావాలని.. డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..

‘బన్నీ ఫ్యాన్స్ అందరికీ హాయ్.. అరవింద్ గారికి, వాసుకి, న్యూ డైరెక్టర్ కౌశిక్, కార్తికేయ.. చావు కబురు చల్లగా టీం అందరికీ నా శుభాకాంక్షలు. ఆర్య విడుదలై 17 ఏళ్ళు అవుతుంది. నాది, సుక్కుది, బన్నీ జర్నీ అంతా గుర్తుకొస్తుంది. అరవింద్ గారు అప్పటికి పెద్ద సినిమాలు చేసేవారు. నేనేమో యంగ్ జనరేషన్ అప్పుడే వచ్చి కొత్త కొత్త దర్శకులతో సినిమాలు చేసాను. ఇప్పుడు చూస్తే వాసు అందర్నీ గీతా ఆర్ట్స్‌కు తీసుకెళ్లి కంటిన్యూగా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నావ్.. కంగ్రాట్స్. అరవింద్ గారు అప్పట్నుంచి స్కెచ్ వేసారన్నమాట. మీరు నాకు మళ్లీ ఇన్స్‌పిరేషన్ సర్. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు ఎలా తీయాలి అని. ఏడాదిన్నర కింద చావు కబురు చల్లగా కాన్సెప్ట్ చెప్పాడు వాసు. ఎన్నో ప్రేమకథలు మనం చూసాం. కానీ ఇది కొత్తగా ఉంది. ఎక్కడైనా చనిపోయిన దగ్గర బాధ పడుతుంటాం కానీ చనిపోయిన అతడి భార్య దగ్గర్నుంచి కథ మొదలుపెట్టాడు దర్శకుడు కౌశిక్. ఆర్య తీసేటప్పుడు ఇలాగే అనుకున్నాం.. ఇదెలా ఉంటదో అని. వాసు ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నావ్.. అడ్వాన్స్ కంగ్రాట్స్’ అని తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ..

‘నాకు నా హోమ్ బ్యానర్. నా బ్యానర్ ఇది.. బన్నీ బాబు బ్యానర్. నాకు ఇందాక నుంచి హై ఓల్టేజ్ వైర్ తెగిపోయి ఆడుకుంటే ఎలా ఉందో అలా ఉంది. ఎందుకంటే బన్నీ బాబును ఇక్కడ కూర్చోబెట్టి. నేను ఎన్ని సినిమాలు చేసినా భలేభలే మగాడివోయ్ తో నాకు గుర్తింపు ఇచ్చిన నా సంస్థ గీతా ఆర్ట్స్. మా అల్లు అరవింద్ గారు, వాసు కొత్త కథలను ఎంకరేజ్ చేస్తుంటారు. కౌశిక్ గానీ.. లావణ్య, కార్తికేయ అంతా చాలా చేసారు. నాతో పని చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్.. టెక్నికల్ టీం అంతా కొత్త ప్రయత్నం చేసారు. కొత్త కథలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పడానికి నిదర్శనం నేనే. కౌశిక్ కూడా అలాగే విజయం అందుకుంటాడని ఆశిస్తున్నా..’ అని తెలిపారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ..

‘ఈ ఏవీ వేస్తున్నట్లు కూడా నాకు తెలియదు. ఈ రోజు మీరు చూసిన ఈ విజువల్‌లో అరవింద్ గారు కానీ, బన్నీ గారు కానీ లేకపోతే నాకు ఈ రోజు మీముందు ఇలా నిలబడి మాట్లాడే అర్హత వచ్చేది కాదు. కానీ ఎప్పుడూ నేను అరవింద్ గారి గురించి మాట్లాడాలి.. ఈ రోజు ఫంక్షన్ కోసం అనుకుంటున్నాను. కానీ నాకు టైమ్ కుదరడం లేదు. ఈ రోజు కూడా వస్తూ వస్తూ చాలా ఆలోచిస్తున్నా ఏం మాట్లాడాలి అని.. కానీ ఆయన గురించి నేను మాట్లాడాను అంటే నేను ఖాళీ అయిపోయాను అని. సర్ అందుకే మీ గురించి నాకు మాట్లాడే టైమ్ రాకూడదని కోరుకుంటున్నాను. కానీ నా లైఫ్‌లో అదే గొప్ప స్పీచ్ అవుతుంది. అది నేను రిజర్వ్ చేసుకుంటున్నాను. అంటే నా జీవితంలో ఇక బన్నీ గారి గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే 18 ఏళ్ళ జర్నీ ఇది. మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం.. క్లాస్ మేట్స్.. కాలేజ్ మేట్స్ కాదు. జస్ట్ క్యాజువల్ గా కలిసిన చాలా చాలా నార్మల్ ఫ్రెండ్ షిప్. ఆ నార్మల్ ఫ్రెండ్ షిప్ కు 18 ఏళ్లు. ఎలా గడిచిపోయినయో కూడా ఈ రోజుకు నాకు తెలియడం లేదు. ఏం చెప్పను నా లైఫ్ బన్నీ.. బన్నీనే నేను. ప్రిపేర్ అవ్వడానికి కూడా ఏం లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. కార్తికేయ గారి గురించి నేను చెప్పేదాని కంటే కూడా ఈ రోజు మధ్యాహ్నమే బన్నీ గారు సినిమా అంతా చూడటం జరిగింది. మీరు చెప్పడమే బాగుంటుంది. తను చాలా ఎత్తుకు ఎదుగుతాడు. కౌశిక్.. జస్ట్ 26 ఏళ్లు.. ఈ రోజు ఓ పెద్దాయన సినిమా చూస్తున్నపుడు అడిగారు ఆ కుర్రాడి వయసెంత అని.. నేను 26 అని చెప్తే నమ్మట్లేదు. 26 ఏళ్లకే ఇంత డెప్త్ గా రాసాడా అని నమ్మట్లేదు. నాకు కలిసినపుడు ఇది మార్చురి వ్యాన్ డ్రైవర్ కథ అండీ.. అక్కడికి వెళ్లినపుడు అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు అన్నాడు.. ఇది వినగానే ఇదేం కథ అని రేపొద్దున్న వింటానమ్మా అని ఒకసారి కూర్చుందాం అని వెళ్లిపోయాను. కానీ ఒక్క ఇన్సిడెంట్ మళ్లీ వెనక్కి తీసుకొచ్చి నన్ను ఈ సినిమాను చేయించింది. అందులో సుక్కు పాత్ర ఉంది. ఏలూరులో ఆర్య విడుదలైన తర్వాత సుకుమార్ ను ఒకరు ఇంటర్వ్యూ చేసారు. మీకు దర్శకుడిగా ఓకే.. ఈ కథను నమ్మి డబ్బులు పెట్టిన దిల్ రాజు గట్స్ మెచ్చుకోవాలి అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత నన్ను కూడా ఎవరో ఒకరు అనకపోతారా అని ఆశ. అలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ కౌశిక్. ప్రత్యేకంగా లావణ్యకు థ్యాంక్స్.. విడో కారెక్టర్ అనగానే ఏమంటారో అనుకున్నాం.. కానీ వెంటనే చేసారు. నా హార్ట్ కు చాలా దగ్గరైన సినిమాల్లో ఇది ఒకటి..’ అని తెలిపారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ..

‘అందరికీ నమస్కారం.. మా సినిమాను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకు అందరికీ థ్యాంక్స్. అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్. గీతా ఆర్ట్స్‌తో ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమా ఎంతపెద్ద హిట్ అవుతుంది అనేది పక్కనబెడితే కథ ప్రకారం ఈ సినిమా నాకు నచ్చింది. దానికి కౌశిక్, వాసు, అరవింద్ గారికి థ్యాంక్స్. కౌశిక్ ఈ కథ చెప్పినపుడు సగంలోనే ఓకే చెప్పాను. ఇలాంటి కథ చెప్పినందుకు థ్యాంక్స్. కార్తికేయ మంచి కో ఆర్టిస్ట్. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నందుకు వాసుకు, అరవింద్ గారికి మరోసారి థ్యాంక్స్..’ అని తెలిపారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ..

‘అరవింద్ గారికి మొట్టమొదటి సారి టేబుల్ ముందు కథ చెప్పినపుడు షివరింగ్ నాకు గుర్తుంది. ఇప్పుడు కూడా ఆయన పక్కన కూర్చుంటే అదే షివర్ ఉంది. మీరు ధైర్యంగా కూర్చున్నాను అనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ సర్.. మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఇలాంటి కథను ఈ వయసులో ఇంత జడ్జి చేస్తున్నారంటే మీ జడ్జిమెంట్ కు నమస్కారాలు సర్. వాసు ద్వారా చాలా నేర్చుకున్నాను నేను. వాసు ఆర్యతో పరిచయం నాకు. ఇండస్ట్రీలో ఎలా బిహేవ్ చేయాలో తెలిసేది కాదు నాకు. తను నాకు మెంటర్. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది వాసుకు తెలుసు. అలా కన్వే అవ్వడం వల్లే స్టోరీ జడ్జిమెంట్ వచ్చింది. అరవింద్ గారి నుంచి ఆ జడ్జిమెంట్ తీసుకుని సూపర్బ్ ప్రొడ్యూసర్ అయ్యాడు. కార్తికేయ గురించి చెప్పాలంటే.. లిప్స్, ఐస్ సింక్ చేయడం కష్టం ఆర్టిస్టులకు. కానీ కార్తికేయ లిప్స్, ఐస్ కాదు ఐ బ్రోస్, చిన్ కూడా సింక్రోనైజ్ అవుతుంది. నువ్వు చాలా పెద్ద యాక్టర్ అవుతావ్. లావణ్య నువ్వు అందర్ని అన్నయ్య అంటున్నావ్ కాబట్టి లవ్ అన్నయ్య అనొచ్చు నిన్ను. కౌశిక్ కొన్నేళ్ల పాటు నువ్వు ఉంటావ్. రంగమ్మత్త నువ్వు ఛమ్మక్ అంటూ ఉంటావ్. తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ ఇలాంటి స్పిరిట్ ఇస్తున్నావ్.. నువ్వు చాలా మందికి ఆదర్శం. సినిమాకు పని చేసిన వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్. ఆమని గారు మావిచిగురు తర్వాత చూడాలనుకున్నా ఇప్పుడు చూస్తున్నాను.. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని.. గీత గోవిందం గీసిన గీతను చెరిపేయాలని కోరుకుంటున్నాను..’ అని తెలిపారు.

దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ..

‘ఇక్కడికి వచ్చిన వాళ్లందరికీ థ్యాంక్స్. అరవింద్ గారు మీ సపోర్ట్‌కు థ్యాంక్స్. వాసు సర్ మీ అవకాశానికి థ్యాంక్స్. అమ్మానాన్నలకు థ్యాంక్స్. కంగారు పెట్టొద్దు ఫస్ట్ టైమ్ స్పీచ్. బన్నీ గారు మాట్లాడతారు. ఫస్ట్ నాకు చాలా మంది అడిగారు. గీతా ఆర్ట్స్‌లో ఎలా వచ్చింది అవకాశం. కొన్నేళ్ల కింద నవదీప్ గారికి స్టోరీ చెప్తే అది నచ్చి.. బన్నీ వాసు గారికి పరిచయం చేసారు. ఆ తర్వాత బన్నీ గారి పిఆర్ శరత్ గారు కూడా ఓ కథ విని వాసు గారికి చెప్పారు. అలా నాకు అవకాశం వచ్చింది. దాన్ని నేను సరిగ్గా వాడుకుంటున్నాను అనుకుంటున్నాను సర్. టెక్నికల్ టీం అందరికీ థ్యాంక్స్. సినిమా బాగుంటుందని నమ్ముతున్నాం.. ఈ రోజు బన్నీ గారు సినిమా చూసారు. ఆయనే చెప్పాలి. కార్తికేయ గురించి చెప్పాలంటే.. ఈ కారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. కార్తిక్ అనుకున్న తర్వాత సెకండ్ డే నే కారెక్టర్ లోకి వెళ్లిపోయాడు. ఆమని గారు థ్యాంక్స్. అనసూయ గారు చాలా థ్యాంక్స్ అండి. ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీంకు థ్యాంక్స్. కోవిడ్ టైమ్ లో బాగా సపోర్ట్ చేసారు. ఫస్ట్ టైమ్ స్పీచ్.. ఏమైనా తప్పులు మాట్లాడుంటే మన్నించండి..’ అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ..

‘మిమ్మల్నందర్నీ ఇక్కడ కూర్చోబెట్టి మేమంతా ఇలా మాట్లాడటం ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే బన్నీ మాటలు వినాలని వచ్చారు మీరంతా. కానీ కొన్నిసార్లు తప్పవు. అప్పటి వరకు ఓపిగ్గా ఉన్నారని అర్థమవుతుంది. నేను మాట్లాడుతుంటే మీరు అరవకుండా ఉంటారని ముందు చెప్తున్నాను. నేను ఆహాకు వెళ్లడానికి.. అక్కడ నేను టైమ్ స్పెండ్ చేయడానికి టైమ్ ఇచ్చింది వాసు. గీతా ఆర్ట్స్ కు అంత సపోర్ట్ గా ఉన్నాడు. ఎక్కవ కష్టపెట్టకుండా ఉన్నాడు. ఈ సినిమా విషయానికి వస్తే.. చిత్రమైన కథ విన్నాను సర్. ఎవరో చచ్చిపోతే.. హీరో వెళ్లి తన ప్రేమకథ మొదలుపెడతాడు సర్.. అక్కడ లవ్ స్టోరీ మొదలవుతుంది సర్ అన్నాడు. విచిత్రంగా ఉందయ్యా ఇది.. ఆ కుర్రాడితో చెప్పించు అన్నాను. కౌశిక్ చెప్తుంటే సినిమా తీసేయగలడు అనిపించిన బహు తక్కువ మంది దర్శకుల్లో ఒక్కడు. చాలా బాగా రాయగలడు అతడు. చాలా కాలం ఉండబోయే దర్శకుల్లో కౌశిక్ ఒకడు. నెక్ట్స్ కార్తికేయ.. నేను అంతా చెప్పను. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఈ సీన్ ఎంత సేపు తీసుకున్నాడు అన్నాను.. అరగంటలో చేసామండి.. రెండు టేకులు అన్నాడు. ఓరి మీ దుంపతెగ అనుకున్నాను. అన్ని ఎక్స్ ప్రెషన్స్ ఉన్న సీన్ అరగంటలో చేయడం కష్టం.. కానీ నువ్ చేసావ్. చాలా మంచి నటుడివి నువ్వు. విడుదలకు ముందే నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. లావణ్యకు మా సంస్థకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. జేక్స్ మీ పాటలు నేను విన్నాను. మలయాళంలో చాలా విన్నాను. ఎప్పుడూ కలిసే వీలు కాలేదు. ఆమని గారు చాలా బాగా చేసారండి. అనసూయ నువ్వంటే నాకు చాలా యిష్టం. కానీ అది చెప్పలేదు. ఇంతకంటే ఏం చెప్పను. గీతా ఆర్ట్స్ అని బన్నీ స్పెషల్ గెస్టుగా వచ్చాడేమో అనుకుంటారేమో.. వాసు బెస్ట్ ఫ్రెండ్ అని వచ్చాడు. చాలా మాట్లాడొచ్చు కానీ బన్నీ కోసం వేచి చూస్తున్నారు కాబట్టి నేను ముగిస్తున్నాను..’ అంటూ తెలిపారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ..

‘నాకు నేను రిలాక్స్ అని అల వైకుంఠపురములో బన్నీ గారి డైలాగ్ నాకు నేను చెప్పుకోవాలి. ఆర్ఎక్స్ 100 నుంచి ఇప్పటి వరకు జరిగే ప్రతీ ఫంక్షన్స్‌కు తెలిసిన హీరోలకు మొహమాటంతో మెసేజ్ పెట్టడమే తప్ప.. బన్నీ గారు లాంటి స్టార్ హీరోను పిలిచే ఛాన్స్ కూడా ఎప్పుడూ రాలేదు. అలాంటిది నా సినిమాకు ఈ రోజు బన్నీ గారు గెస్టుగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇది నాకు ఎంత ఎమోషనల్ మూవెంట్ అనేది నాకు లోపల అర్థమవుతుంది. మీకు ఇది చిన్న విషయం కావచ్చు కానీ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. గంగోత్రి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ అద్భుతం సర్. మీ ప్రతీ సినిమాకు మీ డైలాగ్స్, డాన్స్ అన్నింట్లోనూ వైవిధ్యం ఉంటుంది.. ఎంత హార్డ్ వర్క్ దాని వెనక ఎంత కష్టం ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అరవింద్ గారి కొడుకు.. మెగాస్టార్ మేనల్లుడు అయినా కూడా ఇంత కష్టపడుతున్నారు కాబట్టే ఈ స్థాయిలో ఉన్నారు. కొన్నేళ్ళ కింద నేను మీలో ఒకన్ని. నేను 8వ తరగతిలో ఉన్నపుడు తకదిమితోం పాటకు డాన్స్ చేసా.. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోమంటే గోడ దూకి ఆర్య 2కు వెళ్లా.. బిటెక్ ఫైనల్ ఇయర్ సినిమా చూపిస్త మావా పాటకు థియేటర్ లో డాన్సులేసాం. అరవింద్ గారు మిమ్మల్ని చూస్తుంటే కొత్త సినిమాకు కష్టపడినట్లే ఉంటారు. నేను, కౌశిక్ ఎలా ఉన్నామో.. అలాగే మీరు కూడా ఉన్నారు. అరవింద్ గారి ప్రొడక్షన్ లో చిరంజీవి గారూ, రజినీకాంత్ గారూ, పవన్ కళ్యాణ్ గారూ.. అందరూ యాక్ట్ చేసారు. చిరంజీవి గారికి ఎంత మర్యాద ఉందో.. నాకు అదే రెస్టెప్ట్ వచ్చింది. గీతా ఆర్ట్స్ లో అవకాశం అన్నపుడు అక్కడెలా ఉంటుందో మాట్లాడతారో లేదో అనుకున్నాను కానీ ప్రతీ నటుడికి మీ బ్యానర్ లో చేయడం డ్రీమ్. బన్నీ వాసు గారు మీలో ఆ కసి.. ఆ పాలకొల్లులో ఏదో ఉంది సర్. హిట్ వచ్చాక మీ కంటే ఎక్కువ బెనిఫిట్ నేను అవుతా ఎందుకంటే హీరో కాబట్టి. డార్లింగ్ కౌశిక్ గురించి ఏం చెప్పాలి.. నన్ను ఏ మూవెంట్ లో చూసి ఈ కారెక్టర్ చేయించుకుందాం అనుకున్నావో..? పక్కాగా చెప్తున్నాను.. ఆర్య టైమ్ లో సుకుమార్ గారిని ఎలా చూసారో.. ఈ సినిమా తర్వాత అలా చూస్తారు నిన్ను. లావణ్య నీ ఏజ్ పెంచడం లేదు. బిటెక్ సెకండియర్ లో అందాల రాక్షసి చూసి వామ్మో ఏముందిరా అనుకున్నాం. ఇప్పుడు నాతో యాక్ట్ చేసినందుకు థ్యాంక్స్. నా ఫ్రెండ్స్ కూడా నువ్వు లావణ్య త్రిపాఠితో నటిస్తున్నావ్ అయితే హీరో అయ్యావ్ అంటున్నారు. ఇప్పటి వరకు అందాల రాక్షసితో గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మల్లిక అంటారు. ఆమని గారు సినిమా అయిపోగానే మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. కథ చెప్పినపుడు హీరోయిన్ ఎవరు అనే కంటే హీరో మదర్ ఎవరు అని అడిగాను. సినిమాలో నటించిన వాళ్లందరికీ థ్యాంక్స్. జేక్స్ బిజాయ్ గారూ మీరు ఫస్ట్ టైమ్ ఈ మీటర్ లో కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సర్. లిరిసిస్ట్స్, జానీ మాస్టర్ అందరికీ థ్యాంక్స్. అనసూయ గారిని అలా చూస్తుండిపోయా. నేను మీ ఫ్యాన్. సినిమాకు పని చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవర్నైనా మిస్ అయితే క్షమించండి. ఫైనల్ గా ఒక వెరైటీగా ఓ కాన్సెప్ట్ అనుకున్నా. తెలుగు సినీ లవర్స్ బన్నీ గారికి ఓ లవ్ లెటర్. ప్రియాతిప్రియమైన బన్నీ గారికి… నిన్నటి దాక తెలుగు, మలయాళం ఆడియన్స్ ను ఉర్రూతలూగించారు, ఈ రోజు పుష్పతో ఇండియా వైడ్ ప్రతీ ఒక్కర్నీ షేక్ ఆడించబోతున్నారు. మీరెక్కడికి వెళ్లినా ఏం చేసినా మా అభిమానం మీతో ఉంటుంది అండర్ లైన్. (మా చావు కబురు చల్లగా బ్లాక్ బస్టర్ చేస్తారని). రెడ్ ఇంక్ లో ఉంటాం.. బ్లూ ఇంక్ లో తెలుగు సినిమా ప్రేక్షకులు.. ’ అని ముగించారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారూ మాట్లాడుతూ..

‘చావు కబురు ఎప్పుడూ చల్లగా చెప్పాలి. పుష్ప గురించి చివర్లో చెప్పాలి. ఈ సినిమా గురించి ఓ పిట్టకథ ఉంది. వాసు గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే.. మా నాన్నగారి కంటే ఎక్కువ వాసు కారణం. గంగోత్రి నుంచి ట్రావెల్ అవుతున్నాం. అద్భుతమైన సినిమాలు చేసాడు. 100 పర్సెంట్ లవ్, గీత గోవిందం, భలేభలే లాంటి సినిమాలు చేసాడు. అలాంటి వాసుకు కథ నచ్చడం చిన్న విషయం కాదు. ఎక్కడ్నుంచి వచ్చింది కథ అంటే.. నవదీప్ విని మాకు పంపించాడు. నువ్వు ఇలా ఇచ్చినందుకు థ్యాంక్స్. శరత్ అంటే నాకన్నీ.. శరత్ నాతో పని చేస్తున్నాడు అనేకంటే నా ఫ్యామిలీ. అదేంటో నేనొక్కనే పెరిగితే సరిపోదు.. చుట్టు పక్కలా అంతా పెరగాలి. వాసు సింపుల్ గా మూడు ముక్కలు చెప్పాడు. చాలా బాగుంది కథ అన్నాను. ఇవాళ ఈ సినిమా నేను చూసాను. నా సినిమా గురించి నేను చెప్పలేను కానీ పక్కనోడి సినిమా గురించి చెప్పగలను. చాలా బాగుంది. దర్శకుడు కౌశిక్ గురించి చెప్పాలి. ఈ సినిమా చూస్తున్నపుడు ఏజ్ ఎంత అని వాసును అడిగాను. 26 ఏళ్ళకే ఇంత మెచ్యూరిటీనా.. నాకు రెండు మూడేళ్ల కింద వచ్చిన మెచ్యూరిటీ ఈయనకు ఇప్పుడే వచ్చింది. అందరికీ హిట్ ఇవ్వబోయే దర్శకుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు సిగ్గేసింది నీ మెచ్యూరిటీ చేసి. నేను మీకు బస్తీ బాలరాజు గురించి చెప్పాలి.. కార్తికేయ ఏజ్ ఎంత..? 27, 28 కి ఇంత బాగా చేస్తున్నారు. నేనేం చేసాను ఆ వయసులో.. వీళ్లేంటి ఇంత బాగా చేస్తున్నారు అనుకున్నాను. బస్తీ బాలరాజు గుండెల్లోకి వెళ్తారు. అణువణువు ఇంకిపోయి ఉన్నాడు. ఈ రోజు కార్తికేయ మాట్లాడిన విధానం చాలా బాగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత బాలరాజు.. ఇప్పుడు మీ మాటలు బాగా నచ్చాయి. తన జెన్యూన్ వర్క్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన బిజాయ్స్ నంబియార్ గారికి.. ఆయన మలయాళ సినిమా కల్కికి మంచి మ్యూజిక్ ఇచ్చారు. లావణ్య త్రిపాఠికి గీతా ఆర్ట్స్ లో మూడో సినిమా చేస్తుంది. ఆమె మా లక్కీ హీరోయిన్. ఆమని గారి గురించి చెప్పాలి.. మేం మీ సినిమాలు చూస్తూ పెరిగాం.. మీరెప్పుడెప్పుడు వస్తారా అని చూస్తున్నాం. ఈ రోజు మీకు ఇంత మంచి సినిమాతో వచ్చారు. అమ్మా చాలా బాగా చేసారు మీరు. శుభలగ్నం, మావిచిగురు లాంటి సినిమాలు చూస్తూ పెరిగాం. మా అందరికీ చాలా యిష్టమైన ఆర్టిస్ట్ మీరు. మీలాంటి వాళ్లు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ఇంకా ఎవర్నైనా మరిచిపోయుంటే క్షమించండి.. తెలుగు ప్రేక్షకులకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. థియేటర్స్ కు వస్తారా అనుకుంటే మీరు సినిమా తీయండి వస్తాం అని భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. క్రాక్ గానీ, ఉప్పెన గానీ అందరికీ థ్యాంక్స్. వెళ్లేప్పుడు పుష్ప గురించి ఒక్కమాట చెప్పాలి. మీరు నా బలం.. ఆర్మీ.. ప్రాణం.. స్వతహాగా సంపాదించుకున్నానంటే అది కార్ కాదు, కోట్లు కాదు.. మీ అభిమానం మాత్రం. గర్వపడేంత వరకు తీసుకెళ్తాను. ఇది నా ప్రామిస్. సుమ గారికి థ్యాంక్స్. చావు కబురు చల్లగా మీకు కూడా నచ్చుద్ది. ఈ సినిమాలో కొత్త విషయం ఉంది. పుష్ప గురించి ఒకే మాట.. పుష్ప తగ్గేదే లే..’ అంటూ ముగించారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamani
  • #Actor Karthikeya
  • #Chavu Kaburu Challaga
  • #Dr. Bhadram
  • #Karthikeya

Also Read

The RajaSaab Collections: 7వ రోజు పెరిగాయి.. మొదటి వారం ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

The RajaSaab Collections: 7వ రోజు పెరిగాయి.. మొదటి వారం ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్లు క్రాస్ చేసేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్లు క్రాస్ చేసేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Anaganaga Oka Raju Collections: 2వ రోజు కూడా అదరగొట్టేసిన ‘అనగనగా ఒక రాజు’ కలెక్షన్స్

Anaganaga Oka Raju Collections: 2వ రోజు కూడా అదరగొట్టేసిన ‘అనగనగా ఒక రాజు’ కలెక్షన్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 3వ రోజు ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’… కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 3వ రోజు ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’… కానీ

Nari Nari Naduma Murari Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. అదిరిపోయిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఓపెనింగ్స్

Nari Nari Naduma Murari Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. అదిరిపోయిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఓపెనింగ్స్

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

related news

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

trending news

The RajaSaab Collections: 7వ రోజు పెరిగాయి.. మొదటి వారం ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

The RajaSaab Collections: 7వ రోజు పెరిగాయి.. మొదటి వారం ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

15 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్లు క్రాస్ చేసేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్లు క్రాస్ చేసేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

15 hours ago
Anaganaga Oka Raju Collections: 2వ రోజు కూడా అదరగొట్టేసిన ‘అనగనగా ఒక రాజు’ కలెక్షన్స్

Anaganaga Oka Raju Collections: 2వ రోజు కూడా అదరగొట్టేసిన ‘అనగనగా ఒక రాజు’ కలెక్షన్స్

15 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 3వ రోజు ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’… కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 3వ రోజు ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’… కానీ

16 hours ago
Nari Nari Naduma Murari Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. అదిరిపోయిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఓపెనింగ్స్

Nari Nari Naduma Murari Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. అదిరిపోయిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఓపెనింగ్స్

16 hours ago

latest news

Actor Harsha Vardhan : శివాజీ చేసిన తప్పు అదే… నటుడు హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్

Actor Harsha Vardhan : శివాజీ చేసిన తప్పు అదే… నటుడు హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్

16 hours ago
Naga Vamsi: 72 గంటల నుండి తెగ డ్యూటీ చేస్తున్నారు.. మీకు ఏ రేంజ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానో త్వరలోనే చెబుతా : నాగవంశీ

Naga Vamsi: 72 గంటల నుండి తెగ డ్యూటీ చేస్తున్నారు.. మీకు ఏ రేంజ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానో త్వరలోనే చెబుతా : నాగవంశీ

18 hours ago
Mahesh Babu: బన్నీ కంటే ముందు మహేష్‌బాబే స్టార్ట్‌ చేసేస్తున్నాడు.. ఇక్కడ ఎప్పుడో?

Mahesh Babu: బన్నీ కంటే ముందు మహేష్‌బాబే స్టార్ట్‌ చేసేస్తున్నాడు.. ఇక్కడ ఎప్పుడో?

20 hours ago
People Media And Pawan Kalyan: అప్పుడెప్పుడో ఇచ్చిన మాట.. ఇప్పుడు షురూ చేయబోతున్న పవన్‌

People Media And Pawan Kalyan: అప్పుడెప్పుడో ఇచ్చిన మాట.. ఇప్పుడు షురూ చేయబోతున్న పవన్‌

20 hours ago
Jailer 2: అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

Jailer 2: అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version