అల్లు అర్జున్ కారావాన్ కు ప్రమాదం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారావాన్ ప్రమాదానికి గురైంది. కొద్దీ సేపటి క్రితం జరిగిన ఈ ఘటన అభిమానులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ మొత్తంలో అత్యంత విలాసవంతమైన కారా వాన్ లో అల్లు అర్జున్ కారావాన్ కూడా ఒకటి. దాన్ని అందరూ కారవాన్ అని పిలవకుండా ఉండడానికి ఒక పేరు కూడా పెట్టారు. ఫల్కన్ లవ్ అని అప్పట్లో ఒక పేరు బాగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.

అదే అల్లు అర్జున్ కారావాన్ పేరు. ఇక రీసెంట్ గా పుష్ప షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా వ్యాన్ కు యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం సమయంలో అల్లు అర్జున్ అందులో లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం కూడా లేదని తెలుస్తోంది. చిన్నపాటి డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. వెనుక భాగం అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్లు తెలుస్తోంది. ఇక అందులో పుష్ప సినిమాకు సంబంధించిన మేకప్ టీమ్ ఉన్నట్లు సమాచారం.

ఖమ్మం సమీపంలోని సత్యనారాయణ పురం దగ్గర కారావాన్ ను లారీ ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus