Allu Arjun: అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ పాత్రలు చూస్తే గూస్స్ బంప్స్ రావాల్సిందే..!

  • August 27, 2023 / 12:12 PM IST

అల్లు అర్జున్ మెగా మేనల్లుడిగా, అగ్ర నిర్మాత తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దేశముదురుతో రికార్డు సృష్టించాడు అల్లు అర్జున్ . అక్కడి నుంచి వెనక్కి చూసుకోలేదు. పుష్పతో ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ లో ఘనత సాధించాడు. ఇప్పుడు తాజాగా ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఆయన పోషించిన పాత్రల్లో ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన.. ఐదు పాత్రలు మీ కోసం..

అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే కాదు యావత్ భారత సినిమా ఇండస్ట్రీ గుర్తుపెట్టుకునే పాత్ర ‘పుష్పరాజ్‌’. సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమాలోని ఈ పాత్రలో బన్నీ నటనకు భారత్ మొత్తం ఫిదా అయింది. ఈ సినిమాలో నటనకే ఆయనకు జాతీయ అవార్డు వరించింది.

అల్లు అర్జున్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో కీలకమైనది ‘గోన గన్నారెడ్డి’. ‘రుద్రమదేవి’ సినిమాలో ఆయన పోషించిన ఈ పాత్రకు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ లభించింది. ‘గమ్మునుండవోయ్‌’, ‘తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా’ అంటూ బన్నీ చెప్పిన డైలాగులు మామూలుగా ప్రేక్షకులను అలరించలేదు.

అల్లు అర్జున్‌ నటించిన సీరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ తొలిసారి సైనికుడిగా కనిపించాడు. ఈ సినిమా కోసం బన్నీ లుక్స్‌ పరంగా అప్పట్లో ఏ హీరో చేయని సాహసం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

అల్లు అర్జున్‌ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రాల్లో ‘వేదం’ ఒకటి. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీ బస్తీ కుర్రాడిగా కేబుల్‌ రాజు పాత్రలో నటించి తెలుగువారిని మెప్పించాడు. కమర్షియల్‌ సినిమాలు రాజ్యమేలుతోన్న తరుణంలో హీరో పాత్రకు సరైన ఎలివేషన్స్‌ లేకపోయినా, ఆ పాత్ర చివరకు చనిపోతుందని తెలిసినా.. కథ, దర్శకుడిని నమ్మి ‘వేదం’లో ఆయన నటించాడు.  కంటెంట్‌ విషయంలో బన్నీకి (Allu Arjun) ఉన్న జడ్జిమెంట్‌కు ఇదొక ఉదాహరణ అనుకోవచ్చు.

సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు సందేశాలను ఇస్తూ ప్రేక్షకులను మంచిదారిలో పెట్టడానికి అని ప్రూవ్ చేశాడు అల్లు అర్జున్‌. అందుకు నిదర్శనమే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా.  త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ఈ రెండు సినిమాల్లో బన్నీ పాత్ర యువతలో స్ఫూర్తి నింపేలా ఉంటుంది.

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో తండ్రి ఇచ్చిన మాట, ఆయన పేరు నిలబెట్టడం కోసం కోట్ల ఆస్తిని వదిలి కష్టాలు ఎదుర్కొని నిజాయతీతో ఉండే తనయుడిగా కనిపించారు. ‘అల.. వైకుంఠపురములో..’ కుటుంబాన్ని ఒక్కటి చేసే కుమారుడిగా నటించి మెప్పించాడు.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus