సినిమాల్లోకి వచ్చే మహిళలు, అమ్మాయిల సంఖ్య పెరగాలి… ఈ మాట మా చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. మీ ఇంట్లో వాళ్లను అడిగినా ఇదే మాట చెబుతారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. స్టార్లు, దర్శకుల పిలుపులోనూ మార్పులేదు. దీని వెనుక ఉన్న కారణమేంటి అనేది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు బయటికొస్తాయి. తెలుగు సినిమాల్లోకి అమ్మాయిల రాక నిజంగానే తగ్గుతోందా? లేక రానివ్వడం లేదా? ఓసారి చూద్దాం.
అసలు ‘సినిమాల్లోకి తెలుగు అమ్మాయిలు’ అనే కాన్సెప్ట్ చర్చకు రావడానికి కారణం అల్లు అర్జున్. ‘వరుడు కావలెను’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ మాటలు అన్నాడు. ‘‘లక్ష్మీసౌజన్య దర్శకురాలు కావడం ఆనందంగా ఉంది. అమ్మాయిలు చిత్ర పరిశ్రమకి రావాలి. ముంబయిలో సినిమా చేసేటప్పుడు సెట్లో 50 శాతం అమ్మాయిలు కనిపిస్తుంటారు. మన దగ్గర ఇలా ఎప్పుడు కనిపిస్తారా అనుకుంటుంటాం’’అని అన్నాడు బన్నీ. దీంతో ఇండస్ట్రీలో అమ్మాయిలు రావాల్సిందే, ఎందుకు రావడం లేదో అని అందరూ అనేసుకుంటున్నారు.
నిజానికి అమ్మాయిలు వచ్చి సినిమాల్లో పని చేయడానికి తగ్గ పరిస్థితులు టాలీవుడ్‌లో ఉన్నాయా? అంటే గతంలో చాలామంది చేసిన విమర్శలు, ఆరోపణలు గుర్తొస్తాయి. మన దగ్గర నుండి హీరోయిన్లు అయ్యి… ఇక్కడ అవకాశాలు రాక పక్క పరిశ్రమలకు వెళ్లిపోయిన అమ్మాయిలు చెబుతారు. టాలీవుడ్ సిట్యువేషన్. దాని బట్టి అర్థమవుతుంది. రావడం లేదా? వస్తే ఉండటం లేదా? అనేది.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?