Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 10 ఆసక్తికర విషయాలు..!

అచ్చతెలుగు హాస్యానికి చిరునామాగా నిలిచి.. తెలుగు ప్రేక్షకుల ముఖాలపై నవ్వుల జల్లులు కురిపించిన అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు అరవింద్ ఎంట్రీ ఇచ్చి.. మొదట్లో వేషాలేసినా.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు.. తర్వాత అల్లు అర్జన్ (Allu Arjun) బాలనటుడిగానే ఎంట్రీ ఇచ్చి తాతకి తగ్గ మనవడు, తండ్రికి తగ్గ మనవడు అనిపించుకున్నాడు.. బన్నీ హీరోగా పరిచయమైన ‘గంగోత్రి’ చిత్రం 2003 మార్చి 28న విడుదలైంది.. 2023 మార్చి 28 నాటికి హీరోగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు..

1) బాలనటుడు..

మెగాస్టార్ చిరంజీవి ‘విజేత’ చిత్రంతో బన్నీ బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు.. తర్వాత తన 4వ ఏటనే విశ్వనటుడు కమల్ హాసన్ – కె. విశ్వనాథ్ కలయికలో వచ్చిన క్లాసిక్ ‘స్వాతి ముత్యం’ లో కనిపించాడు.. టీనేజ్‌కి వచ్చాక, హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు మామయ్య చిరు ‘డాడీ’ మూవీలో డ్యాన్స్ స్టూడెంట్‌గా కనిపించాడు..

2) అల్లు వారి హీరో..

‘గంగోత్రి’ మూవీతో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు హీరోగా పరిచయం చేశారు.. దర్శకుడిగా ఆయన 100వ సినిమా ఇది.. ఫస్ట్ మూవీకే బెస్ట్ అనిపించుకున్నాడు.. రెండో చిత్రం ‘ఆర్య’ తో యూత్ హీరోగా, స్టైలిష్ స్టార్‌గా మారిపోయాడు.. ‘ఆర్య 2’ వరకు వరుసగా 7 సినిమాలు 100 రోజులు పోస్టర్ పడడం విశేషం..

3) మల్లు అర్జున్..

టాలీవుడ్ అల్లు అర్జున్ కాస్తా మాలీవుడ్‌లో మల్లు అర్జున్‌గా మారిపోయాడు.. కేరళలో బన్నీ క్రేజ్ మామూలుగా లేదు.. రేర్ రికార్డ్స్ క్రియేట్ చేశాడక్కడ.. అలాగే అక్కడి ప్రభుత్వం అధికారిక బోట్ పోటీల ప్రారంభోత్సవానికి బన్నీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది..

4) స్టార్ కిడ్స్..

బన్నీ, స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వీరికి ప్రేమకు ప్రతిరూపంగా అయాన్, అర్హ పుట్టారు.. ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తూ.. వీలు కుదిరినప్పుడల్లా పిల్లలతో కలిసి పిల్లాడిలా మారిపోయి ఆటలాడుతుంటాడు.. కుమార్తె అల్లు అర్హని సమంత ‘శాకుంతలం’ మూవీతో బాలనటిగా పరిచయం చేస్తున్నారు..

5) ఐకాన్ స్టార్ – పాన్ ఇండియా స్టార్..

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారడమే కాక ‘పుష్ప : ది రైజ్’ తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.. ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ రాజ్‌గా పాన్ ఇండియా స్థాయిలో పాండమిక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి, అత్యధిక కలెక్షన్లతో రికార్డ్ నెలకొల్పి, నార్త్‌లోనూ గుర్తింపు తెచ్చిపెట్టింది.. తర్వాత రష్మాలోనూ రిలీజ్ చేశారు..

6) ఇండియన్ ఆఫ్ ది ఇయర్..

‘పుష్ప’ తో నార్త్‌లో వచ్చిన క్రేజ్ చూసి బాలీవుడ్ వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు.. సీఎన్ఎన్ – న్యూస్ 18 ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డ్ అందుకున్నాడు అల్లు అర్జున్.. నందితో సహా పలు అవార్డలు బన్నీ ఖాతాలో ఉన్నాయి..

7) A A A సినిమాస్..

బన్నీ, ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏ ఏ ఏ సినిమాస్ (ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్) స్థాపిస్తున్నాడు.. అమీర్ పేట్ సత్యం థియేటర్‌ని పడగొట్టి.. అదే ప్లేసులో అత్యాధునిక సౌకర్యాలతో మల్టీప్లెక్స, షాపింగ్ మాల్ నిర్మించారు.. ఇందులో బన్నీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారని సమాచారం..

8) అల్లు స్టూడియో..

సొంతగా ఓ స్టూడియో ఏర్పాటు చేయాలనేది తాత అల్లు రామలింగయ్య కోరిక అని అందుకే అల్లు ఫ్యామిలీ స్టూడియో స్థాపిస్తుందని బన్నీ చెప్పిన సంగతి తెలిసిందే.. 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు..

9) లగ్జరీ లైఫ్ స్టైల్..

జూబ్లీ హిల్స్‌లో బ్లెస్సింగ్ పేరుతో సాలిడ్ లావిష్ హౌస్ ఉంది బన్నీకి.. దీని విలువ 60 నుండి 80 కోట్ల వరకు ఉంటుంది. అలాగే కోకాపేట్‌లో 50 కోట్ల విలువ చేసే కొన్ని ఎకరాల స్థలం కూడా ఉంది.. బన్నీ యూత్ స్టైల్ ఐకాన్.. తన డ్రెస్సెస్, వాచెస్ దగ్గరి నుండీ ప్రతి వస్తువు కాస్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు.. ఇక తన గ్యారేజీలో కోట్లు విలువ చేసే లగ్జరీ కార్స్, రూ. 7 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించుకున్న కారవాన్ కూడా ఉంది..

10) రెమ్యునరేషన్ 125 కోట్లు..

‘పుష్ప’ పార్ట్ 1 కే దాదాపు రూ. 60 కోట్లు తీసుకున్నాడని టాక్.. పార్ట్ 2కి ఇంకా ఎక్కువే ఉంటుంది.. ‘పుష్ప : ది రూల్’ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవలే అనౌన్స్ చేశారు.. దీనికి గానూ బన్నీకి అక్షరాలా రూ. 125 కోట్ల పారితోషికం అందుతుందట..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus