ప్రతి హీరో కెరీర్ కు కొన్ని సినిమాలు ఊహించని స్థాయిలో ప్లస్ అవుతుంటాయి. బన్నీ కెరీర్ లో అలా ప్లస్ అయిన సినిమాలలో పుష్ప ది రైజ్ ఒకటి. తొలిరోజే పుష్ప ది రైజ్ కు నెగిటివ్ టాక్ రావడంతో పాటు క్రిటిక్స్ నుంచి కూడా నెగిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమా ఫుల్ రన్ లో భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చే అవకాశం అయితే ఉందనే కామెంట్లు జోరుగా వినిపించాయి. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం పుష్ప ది రైజ్ భారీ కలెక్షన్లు సాధించకపోవచ్చని భావించారు.
అయితే అందరి అంచనాలకు భిన్నంగా పుష్ప ది రైజ్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది. బన్నీకి సోషల్ మీడియాలో కూడా పుష్ప సినిమాతో అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది. తగ్గేదేలే అనే ఒకే ఒక్క డైలాగ్ తో దేశవ్యాప్తంగా బన్నీ గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా బన్నీని వాడేయడం గమనార్హం. గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.
ఏపీలో ఒక్కరోజే 10,000కు పైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. తెలంగాణలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం డెల్టా వేరియంట్ లేదా ఒమిక్రాన్ వేరియంట్ ఏ వేరియంట్ అయినా నేను మాత్రం మాస్క్ తీసేది లేదు అంటూ పుష్పరాజ్ పోస్టర్ ను షేర్ చేసింది. కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం పుష్పరాజ్ పోస్టర్ ను వాడుతూ కరోనా నియంత్రణ గురించి అవగాహన కల్పిస్తుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం బన్నీ పోస్టర్ ను వాడటంతో బన్నీకి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పాలి. బన్నీ తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే బన్నీ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మహేష్ రిజెక్ట్ చేసిన కథతోనే పుష్ప సినిమా తెరకెక్కడం గమనార్హం. బన్నీ మీమ్స్ పోస్టర్స్ ద్వారా సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అంటూ హవా సృష్టిస్టున్నారు.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!