అరుదైన రికార్డు సాధించిన అల్లు అర్జున్

  • June 6, 2020 / 05:40 PM IST

అల్లు అర్జున్ ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి1’ కలెక్షన్స్ ను అధిగమించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు తమన్ మ్యూజిక్ పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రం తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ అనే చిత్రం చేస్తున్నాడు బన్నీ. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

‘ఆర్య’ ‘ఆర్య2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కావడంతో.. దీని పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.ఇదిలా ఉండగా.. తాజాగా బన్నీ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. అదేంటంటే.. బన్నీ ఫేస్‌బుక్‌ పేజ్ ఏకంగా 13 మిలియన్స్ లైక్స్ క్రాస్ చేసింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ పేజీకి 13,197,873 లైక్స్ నమోదు కావడం విశేషం.

సౌత్ స్టార్స్ లో ఈ రికార్డు బన్నీకి మాత్రమే దక్కింది.మామూలుగానే అల్లు అర్జున్ ని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని అంటుంటారు. ఇతను నటించే ఏ సినిమా అప్డేట్ విడుదలైనా.. క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటుంది. బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్ కూడా బన్నీ యాక్టింగ్ ను అమితంగా ఇష్టపడుతుంటారు. ఇతని డ్యాన్స్ వల్లే ఇతనికి మరింత క్రేజ్ ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus