అల్లుఅర్జున్ కొత్త సినిమా కథ ఇదే!

ఓ గ్రామంలో డాన్స్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న యువకుడు దువ్వాడ జగన్నాథమ్. అక్కడి స్టేజీలపై డ్యాన్సులు విరగదీస్తుంటాడు. సిటీలో తనకి మంచి గుర్తింపు లభిస్తుందని బయలు దేరుతాడు. పబ్ లో డీజే గా చేరి తన ట్యాలెంట్ ని ప్రదర్శిస్తాడు. అది చూసిన కొంతమంది దువ్వాడ జగన్నాథమ్ ని తొక్కేయాలని ప్రయత్నిస్తారు. వివాదాల్లో ఇరికిస్తారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న అతనికి ఓ గొప్పింటి అమ్మాయి అండగా నిలుస్తుంది. దీంతో తనపై ప్రతాపం చూపిన వారికి చెమటలు పట్టిస్తాడు.

సమస్యలన్నీ తీరిపోయింది అనుకునే సమయంలో డీజే కి హెల్ప్ చేసిన అమ్మాయి చిక్కుల్లో ఇరుక్కుంటుంది. అందుల్లోంచి ఆమెను రక్షిస్తాడు… ఇది సింపుల్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్న సినిమా కథ. ఇందులో గొప్పింటి అమ్మాయిగా గోపికమ్మ పూజ హెగ్డే నటిస్తోంది. బన్నీ తో ఆర్య, పరుగు చిత్రాలను నిర్మించిన దిల్ రాజు  ఏడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ తో సినిమా తీస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న డ్యాన్స్ బేస్డ్ యాక్షన్ మూవీ కోసం కొరియోగ్రాఫర్లు సరికొత్త స్టెప్స్ కంపోజ్ చేయడంలో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ మాత్రం డిఫరెంట్ లుక్ తో స్టైల్ గా కనిపించడానికి ఫ్యాషన్ నిపుణులతో చర్చిస్తున్నారు.

Jr NTR Competition to Allu Arjun in Malayalam Industry - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus