Allu Arjun: నాకు కనిపించే దేవుడు మా నాన్నే.. ఎమోషనల్ అయిన బన్నీ!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఈయన ఈ సినిమాషూటింగ్ పనులలో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ టు గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ పెద్ద ఎత్తున సందడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా శృతి అనే కంటెస్టెంట్ పాట పాడడంతో అల్లు అర్జున్ తనకు శృతి అనే పేరు అంటే చాలా ఇష్టం అని తెలిపారు. అది నా మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలియజేశారు.ఇలా అల్లు అర్జున్ చెప్పడంతో వెంటనే గీతామాధురి ఫస్ట్ క్లాస్ గర్ల్ ఫ్రెండా అంటూ మాట్లాడటంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.ఇలా తన పస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరును రివిల్ చేసిన అల్లు అర్జున్ అనంతరం తన తండ్రి గురించి కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) తన తండ్రి గురించి మాట్లాడుతూ నాకు దేవుడు ఎలా ఉంటారో తెలియదు. కానీ నాకు అన్నీ ఇచ్చిన నా దేవుడు మా నాన్న. ఆయనే నాకు దైవం…నాకు కనిపించే దేవుడు అతనే అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఇక సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ చరిత్ర కలిగి ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే అయితే ఈయన ఇండస్ట్రీలో ఎదగడానికి తన తండ్రి సహకారం కూడా ఎంతో ఉందని, ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన తండ్రి గురించి చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus