అందమైన ప్రాంతాల్లో విహరిస్తున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ!

  • September 18, 2018 / 12:40 PM IST

అభిమానులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. తన గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకుంటుంటారు. సినిమాల గురించి మాత్రమే కాదు… వ్యక్తిగత విషయాలను సైతం చెబుతుంటారు. అందుకే అతనికి ట్విట్టర్లో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే తన పిల్లలు అయాన్, అర్హ ల కోసం స్పెషల్‌ ఫొటో షూట్స్‌ చేసి, ఆ ఫొటోలను అభిమానులతో పంచుకోవడం అల్లు అర్జున్‌కి అలవాటు. తాజాగా బన్నీ తన భార్య స్నేహ పిల్లల్తో కలిసి అందమైన ప్రాంతాలను చుడుతున్నారు. అలా సరదగా గడుపుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో అయాన్, అర్హ లతో పాటు మరికొంతమంది పిల్లలు ఉన్నారు. వారిని కూడా తమ బ్యాచ్ లో కలుపుకొని బన్నీ సందడి చేస్తున్నారు. నా పేరు సూర్య కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమా హిట్ కాలేకపోయిది. దీంతో ఆలోచనలో పడ్డ మంచి కథ కోసం ఎక్కువరోజులు ఎదురు చూసారు. మనం.. హలో దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథ నచ్చడంతో అతనికి స్క్రిప్ట్ పని అప్పగించి.. తాను మాత్రం విహారానికి వెళ్లారు. ఈ టూర్ ముగించుకొని రాగానే కొత్త సినిమా పనుల్లో నిమగ్నం కానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus