సోషల్ మీడియా వల్ల ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియదు కానీ.. ఇదే సోషల్ మీడియా కొన్ని వేల మందికి టైమ్ పాస్, కొన్ని వందల మందిని రోజూ ప్రపంచానికి పరిచయం చెసి ఫేమస్ అయ్యేలా చేస్తుంది. ఇక పదుల సంఖ్యలో అవసరార్ధులకు సాయం అందేలానూ చేస్తుంది. అయితే.. ఇదే సోషల్ మీడియాను వాడుకొని బన్నీ వినయ్ అనే ఒక కుర్రాడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరియు ఇతర నెటిజన్ల నుండి దాదాపుగా 30 లక్షల రూపాయల దాకా వసూలు చేశాడని తెలుస్తోంది.
అల్లు అర్జున్ కి పెద్ద అభిమాని అని చెప్పుకొనే బన్నీ వినయ్ కి రీసెంట్ గా యాక్సిడెంట్ అయ్యిందని, హాస్పిటల్లో కోలుకోలేని స్థితిలో ఉన్నాడని.. ఆర్ధిక సహాయం కావాలని ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. దాంతో అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాక చాలా మంది నెటిజన్లు కూడా తమకు కుదిరినంత సహాయం చేశారు. అయితే.. దాదాపు 30 లక్షల రూపాయల వరకూ ఆర్ధిక సహాయం కూడబెట్టిన తర్వాత ఆ బన్నీ వినయ్ అనేవాడే ఫేక్ అని, అతడి అసలు పేరు అది కాదని, అంతా బాగానే ఉన్నారని, కేవలం డబ్బు కోసం అలాంటి పోస్టులు పెట్టి డబ్బు వసూలు చేశాడని తెలిసింది. దాంతో.. అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాక నెటిజన్లు కూడా ఇలా ఎవడో మొఖం కూడా తెలియని వాడి వల్ల యదవలు అయినందుకు చాలా బాధపడుతున్నారు. ఇలాంటోళ్ళ వల్లే.. నిజంగా అవసరం ఉన్నవాళ్లకి సహాయం చేయడానికి చాలా మంది జంకుతున్నారు.
బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?