ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ. మరోవైపు స్టైలిష్‌గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అల్లు అర్జున్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని అఫిషియల్‌గా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాను చెక్కుతున్నాడు శివ. తన బడ్డీ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప మూవీలో నటిస్తున్నాడు బన్నీ. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచానాలు బాగానే ఉంటాయి. ఇప్పటి వరకు యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో అలరించిన బన్నీ, పాత్ర కోసం తనను తాను మార్చుకోవడానికి గొడ్డులా కష్టపడతాడు.
కొరటాల ఏ సినిమా చేసిన ఏదో ఒక సామాజిక అంశం తీసుకుని తనస్టైల్ కమర్షియల్ అంశాలు జోడించడంలో తనకు తానే సాటి. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే కథ ఎలా ఉంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్. అయితే కొద్దిరోజులుగా శివ - బన్నీ సినిమా మెయిన్ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొరటాల మరోసారి సామాజిక అంశాన్నేఎంచుకున్నాడని, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం తెరకెక్కనుండి టాక్ వినిపిస్తోంది. మొదట స్టూడెంట్ లీడర్‌గా, ఆ తర్వాత సెకండాఫ్‌లో పొలిటికల్ లీడర్‌గా బన్నీ కనిపించనున్నాడట. యువకులు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అనే పాయింట్‌తో కొరటాల శివ ఈ కథను సిద్ధం చేశారట.
ఈ పాయింట్ ఎక్కుడో విన్నట్టు ఉంది కదా.. మహేష్ అండ్ గుణశేఖర్ కాంబోలో తెరకెక్కిన సైనికుడు మూవి స్టోరీ గుర్తుకు వచ్చింది చాలామందికి. ముఖ్యంగా ఈ చూసిని అండ్ విన్న బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులు చూస్తుంటే తెలుస్తోంది. బాబోయ్ ఇలాంటి కథను ఎందుకు ఎంచుకున్నారు.. సైనికుడు రిజల్ట్ రిపీట్ అవుతుందేమో అని బన్నీ డై హార్ట్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. దీంతో అసలు నిజంగానే స్టోరీ లైన్ అదో కాదో తెలియదు.. ఒకవేళ అదే నిజమైనా అక్కడ కొరటాల శివ ఉన్నాడుగా ఎలాంటి సోషల్ ఎలిమెంట్ లైన్ తీసుకున్నా కమర్షియల్ హంగులతో జోడించడంతో దిట్ట. మరి బన్నీ ఫ్యాన్స్ భయపడాల్సిన అవసరం ఏముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?