Allu Arjun, Trivikram: బన్నీ మూవీ విషయంలో ఫ్యాన్స్ కోరుకునేది ఇదే.. త్రివిక్రమ్ ఏం చేస్తారో?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ కెరీర్ లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాకు కలెక్షన్లు భారీ స్థాయిలోనే వచ్చినా మహేష్ అభిమానులలో చాలామందికి సైతం ఈ సినిమా నచ్చలేదనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం పాటలలో కుర్చీ మడతబెట్టి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రాగా మిగతా పాటలకు మరీ అద్భుతమైన రెస్పాన్స్ రాలేదు. బన్నీ (Allu Arjun) సినిమాకు త్రివిక్రమ్ (Trivikram) అనిరుధ్ (Anirudh Ravichander) లేదా దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

దేవర (Devara) , పుష్ప ది రూల్ (Pushpa2)  సాంగ్స్ లో ఏ సినిమా సాంగ్స్ బాగుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అని ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. బన్నీ సినిమా విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ నిరాశపరచలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. బన్నీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

అల్లు అర్జున్ సైతం తన సినిమాలలో ప్రతి పాట స్పెషల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. బన్నీ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కు నాలుగు నెలల సమయం ఉంది. 2024 బిగ్గెస్ట్ హిట్లలో పుష్ప ది రూల్ ముందువరసలో ఉంటుందని బన్నీ ఫ్యాన్స్ భెబుతున్నారు. పుష్ప ది రూల్ సినిమాలో కొన్ని సీన్స్ ను విదేశాల్లో షూట్ చేస్తారని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ సినిమా హిందీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. గంగమ్మ జాతర ఎపిసోడ్ ను 60 కోట్ల రూపాయల ఖర్చుతో 30 రోజుల పాటు షూట్ చేశారని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ అట్లీ (Atlee Kumar) కాంబినేషన్ లో కూడా సినిమా ఫిక్స్ అయిందని బ్యానర్ సమస్య వల్ల ఈ సినిమా ప్రకటన ఆలస్యమవుతోందని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరింత క్లారిటీ రానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus