కొరటాల బన్నీని అలా చూపించబోతున్నాడా..?

దాదాపు రెండు దశాబ్దాల క్రితం గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు అల్లు అర్జున్. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే అల్లు అర్జున్ కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలేవీ ఇండస్ట్రీ హిట్ కాలేదు. గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ ను ప్రకృతి ప్రేమికుడిగా చూపించిన కొరటాల శివ బన్నీని పొల్యూషన్ చేసే కంపెనీలకు ఝలక్ ఇచ్చే పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది.

తారక్ నటించిన జనతా గ్యారేజ్ లాంటి కథలోనే బన్నీ నటిస్తూ ఉండటం గమనార్హం. మనుషుల బాధ్యత రాహిత్యం గురించి ప్రధానంగా కొరటాల శివ ఈ సినిమాలో చెప్పనున్నారని సమాచారం. బన్నీ ఈ తరహా కథల్లో నటించడం ఇదే తొలిసారి. కొరటాల శివ తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాతో బన్నీ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుండని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2022 సంవత్సరం మార్చి నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus