‘బాహుబలి'(సిరీస్) వచ్చిన తర్వాత… మళ్ళీ రాజమౌళి సినిమా వస్తే తప్ప ఇండస్ట్రీ హిట్ కొట్టే అవకాశం ఎలాగు లేదని అంతా ఫిక్సయిపోయారు. దాంతో ‘నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్’ అనే కొత్త ట్యాగ్ వచ్చి పడింది. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ చిత్రంతో మొదలైన ఈ ‘నాన్ బాహుబలి’ హవా ను మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తో బ్రేక్ చేసాడు. అటు తర్వాత మళ్ళీ ఆయన తనయుడు రాంచరణ్.. ‘రంగస్థలం’ చిత్రంతో బ్రేక్ చేసాడు. ‘రంగస్థలం’ కలెక్షన్లను ‘సాహో’ అధిగమించినప్పటికీ… అందులో ఎక్కువగా బాలీవుడ్ కలెక్షన్లు ఇన్వాల్వ్ అయ్యున్నాయి కాబట్టి ట్రేడ్ పండితులు దానిని లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో ఆ లిస్ట్ లోకి ‘అల వైకుంఠపురములో’ చిత్రం వచ్చి చేరింది.
ఈ చిత్రంతో మొదటిసారి ‘నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్’ అందుకున్నాడు బన్నీ. ఇప్పుడు ఈ కలెక్షన్లను ఏ మెగా హీరో తన సినిమాతో అధిగమిస్తాడు అనే విషయం పై ఆసక్తి నెలకొంది. ‘పింక్’ రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్.. ఈ కలెక్షన్లను అధిగమించే అవకాశం ఉంది. సమ్మర్ లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. దిల్ రాజు నిర్మాత కాబట్టి కచ్చితంగా భారీ స్థాయిలో వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పవన్ మిస్సయినా… మెగా స్టార్ చిరంజీవి.. కొరటాలతో చేసే సినిమా కూడా ‘అల వైకుంఠపురములో’ రికార్డులను బీట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది మిస్సయినా రాంచరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా వస్తుంది కాబట్టి.. నిస్సందేహంగా ‘అల వైకుంఠపురములో’ రికార్డులు బ్రేక్ అయిపోతాయి. ఇక్కడ ఎక్కువగా మెగా హీరోలకే ఆ అవకాశం ఉంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
Most Recommended Video
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!