Allu Arjun, Harish Shankar: ఫారెన్ లో బన్నీ, హరీష్ శంకర్.. ఏం చేస్తున్నారంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ రేంజ్ పెరిగిపోయింది. నార్త్ లో ఆడియన్స్ లో అతడికి ఫాలోయింగ్ ఏర్పడింది. అలానే ఇంటెర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. ఈ సినిమా సక్సెస్ తరువాత బన్నీ చుట్టూ చాలా కార్పొరేట్ కంపెనీలు తిరుగుతున్నాయి. తమ ప్రొడక్ట్స్ ను బన్నీతో ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు ఓ యాడ్ షూట్ కోసం బన్నీ ఫారెన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి మొన్నటివరకు తన ఫ్యామిలీతో కలిసి ఆఫ్రికా ట్రిప్ లో ఉన్న బన్నీ. ఇప్పుడు మళ్లీ ఫారెన్ కి వెళ్లారు. బన్నీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ఒక యాడ్ షూటింగ్ విదేశాల్లో జరగనుంది. ఈ యాడ్ ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. బన్నీ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇదివరకు ‘డీజే’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా నుంచి వారి బంధం బలపడింది.

ఈ యాడ్ ని ముంబైకి చెందిన టీమ్ తీస్తోంది. కానీ బన్నీ పట్టుబట్టి మరీ హరీష్ శంకర్ ని డైరెక్టర్ గా తీసుకున్నారు. హరీష్ శంకర్ పర్యవేక్షణలో ఆ టీమ్ యాడ్ ను చిత్రీకరించనుంది. త్వరలోనే ఈ యాడ్ టీవీల్లో టెలికాస్ట్ కానుంది. రీసెంట్ గా బన్నీ ర్యాపిడో యాడ్ లో నటించగా.. అందులో ఆర్టీసీ బస్సులను చులకనగా చేసి చూపించడంతో కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బన్నీ ‘పుష్ప2’ కోసం సిద్ధమవుతున్నారు. ‘పుష్ప’పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన నటీనటులతో పాటు కొత్తవారు కూడా ఈ సినిమాలో కనిపిస్తారని సమాచారం.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus