సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు అల్లు అర్జున్ (Allu Arjun) మెడకు చుట్టుకుంది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసిన చంచల్ గూడ పోలీసులు, అనంతరం అతన్ని గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత హైకోర్టులో హాజరుపరిచారు. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. విచారణ అనంతరం అల్లు అర్జున్ కి షాకిచ్చింది హైకోర్టు. అవును.. అల్లు అర్జున్ కి హైకోర్టులో చుక్కెదురైంది.
ఆయన అప్లై చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. 14 రోజుల పాటు రిమాండ్ కి తరలించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాసేపట్లో చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ ని తరలించనున్నారు. ఇప్పటికే అక్కడ హై- సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క రేవతి భర్త భాస్కర్..
‘తన భార్య చనిపోవడానికి అల్లు అర్జున్ కారణం కాదని, తన పిల్లాడు కోరితేనే ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమాకి తీసుకెళ్లానని, అల్లు అర్జున్ అక్కడికి వస్తాడని తనకు తెలీదని, తొక్కిసలాట కూడా అతని ప్లాన్ చేసింది కాదని, అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం కూడా తనకు తెలీదని, హాస్పిటల్లో ఉండటం వల్ల చూసుకోలేదు అని, అవసరమైతే తన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానని’ చెప్పుకొచ్చాడు. మొన్నటికి మొన్న తప్పంతా అల్లు అర్జున్ దే అని చెప్పిన రేవతి భర్త భాస్కర్.. ఇప్పుడు ఇలా చెప్పడం వెనుక కారణాలు ఏంటి అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.