‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సినిమాకు మన దగ్గర తొలుత కాస్త తేడా టాక్ వచ్చినా… తెలుగేతర రాష్ట్రాల్లో మాత్రం సినిమా అదరగొట్టేసింది అని టాక్. మలయాళంలో ఇప్పటికే బన్నీ అంటే పరిచయం ఉంది. కాబట్టి అక్కడ వసూళ్లు బాగున్నాయి అనుకోవచ్చు. మిగిలిన కన్నడ, హిందీ, తమిళంలో సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. వసూళ్లతోపాటు బన్నీకి సోషల్ మీడియాలోనూ హెల్ప్ అయ్యింది అంటున్నారు టాలీవుడ్ పరిశీలకులు.
ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా రోజులుగా అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ మధ్య అప్రకటిత పోటీ జరుగుతోంది. 10 మిలియన్ల ఫాలోవర్ల దగ్గర నుండి ఇది మొదలైంది అని చెప్పొచ్చు. 10.. 11.. 12.. 13.. 14 అంటూ వరుసగా ఇద్దరు హీరోలు అనుచరులను పెంచుకుంటూ వస్తున్నారు. అలా మైలురాళ్లు దాటిన ప్రతిసారి ఇద్దరి మధ్య గ్యాప్ ఒకటి, రెండు లక్షలు మాత్రమే ఉండేది. ఒక నెంబరు బన్నీ ముందు దాటితే, ఇంకో నెంబరు విజయ్ దేవరకొండ ముందు దాటాడు. మిగిలిన వాడు ఆ వెంటనే వచ్చేసేవాడు. అయితే 15 మిలియన్ల దగ్గరకి వచ్చేసరికి అంతా మారిపోయింది.
అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండకు మధ్య గ్యాప్ ఇప్పుడు సుమారు 7 లక్షలు. అంతలా బన్నీ ఇటీవల కాలంలో ఫేమస్ అయిపోయాడు అని చెప్పాలి. ఇదంతా ‘పుష్ప’ వల్లనే అని కూడా అనుకోవచ్చు. ఆ సినిమా ప్రచారం బన్నీ ఇతర సినిమా ఇండస్ట్రీలకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రాచుర్యం పెరిగి సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫాలోవర్ల సంఖ్య పెరిగింది అంటున్నారు. 15 మిలియన్ల నెంబరుతో బన్నీ ఇప్పుడు సౌత్‌లోనే అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న హీరో అయ్యాడు.
దీంతో ఇద్దరు హీరోల ఇన్‌స్టా పోటీ రసవత్తరంగా మారింది. విజయ్ దేవరకొండ ఎప్పుడు 15 మిలియన్ల మార్కును దాటుతాడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ‘లైగర్’ సినిమా రిలీజ్ ఉండుంటే ఆ నెంబరుకు చేరడం పెద్ద కష్టమయ్యేది కాదు. ఈలోపు బన్నీ కూడా తన పనిలో తాను ఉంటాడు కాబట్టి ఆ నెంబర్లు ఇంకా పెరుగుతాయి. సో ప్రస్తుతానికి బన్నీకి ‘పుష్ప’ ఇలా కూడా కలిసొచ్చింది అన్నమాట.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!