Allu Arjun: త్రివిక్రమ్ సినిమాలో విలన్ కూడా బన్నీనే.. ఆ రేంజ్ లో డిజైన్ చేశారా?

గత కొన్నేళ్లలో సినిమాలకు సంబంధించి ప్రేక్షకుల అభిప్రాయం, అభిరుచులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. రొటీన్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఏదో ఒక ప్రత్యేకత, కొత్త తరహా కథనంతో తెరకెక్కిన సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. బన్నీ (Allu Arjun) త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పాన్ ఇండియా సినిమా అని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని హీరో బన్నీనే విలన్ బన్నీనే అని తెలుస్తోంది.

నెగిటివ్ షేడ్స్ లో బన్నీ కనిపించే పాత్రను చాలా వైల్డ్ గా క్రియేట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇచ్చేలా బన్నీ రోల్స్ ఉంటాయని సమాచారం. అయితే బన్నీ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ వస్తే బాగుంటుందని చెప్పవచ్చు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా ఆ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ 250 నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ కోసం మరో రెండేళ్లు ఎదురుచూడాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అల్లు అర్జున్ తన సినిమాల కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది. జై లవకుశ సినిమాలో తారక్ హీరోగా రెండు పాత్రల్లో విలన్ గా ఒక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తూ తారక్ ను ఫాలో అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus