ప్రతి ఇండస్ట్రీకి ఒక ల్యాండ్ మార్క్ యాక్టర్ ఉంటారు. ఇంతకుముందు హిందీ సినిమా అంటే అమితాబ్ బచ్చన్, తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్, తమిళం అంటే ఎంజీఆర్, కన్నడ అంటే రాజ్ కుమార్, మలయాళం అంటే మోహన్ లాల్ అని చెప్పుకొనేవారు. ఆ తర్వాత తరాలు మారడంతో హిందీకి షారుక్, తెలుగుకి మహేష్, తమిళంకి విజయ్, కన్నడకి శివరాజ్ కుమార్ ల పేర్లు చెప్పుకొచ్చేవారు. కానీ ప్యాన్ ఇండియన్ క్రేజ్ మొదలయ్యాక మాత్రం ఆ ల్యాండ్ మార్క్ లు మారిపోయాయి. ఏడాదికి ఒక ల్యాండ్ మార్క్ యాక్టర్ మారుతున్నారు.
అయితే.. ఇవాళ విడుదలైన “పరం సుందరి” ట్రైలర్లో జాన్వీ కపూర్ లాస్ట్ లో “తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కేరళ-మలయాళం మోహన్ లాల్, ఆంధ్ర-తెలుగు అల్లు అర్జున్, కర్ణాటక-కన్నడ యశ్” అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జాన్వికపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో “పెద్ది” సినిమా చేస్తూ, తదుపరి అల్లు అర్జున్ తో నటించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరి ఆల్రెడీ ఎన్టీఆర్ తో నటించి ఉండడంతో ఆమెను ఎన్టీఆర్ అభిమానులు కానీ, ప్రభాస్ అభిమానులు కానీ ట్రోల్ చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే.. “పుష్ప” క్రేజ్ వల్లే అల్లు అర్జున్ పేరును తమ సినిమాలో వాడుకుని ఉంటారు మేకర్స్. కానీ.. చెప్పేది జాన్వికపూర్ కాబట్టి ఆమెను కచ్చితంగా ట్రోల్ చేస్తారు కొందరు ఫ్యాన్స్.
ఇకపోతే.. ఆగస్ట్ 29న విడుదలకాబోతున్న ఈ “పరం సుందరి” సినిమాపై జాన్వీ చాలా ఆశలు పెట్టుకుంది. గత కొంతకాలంగా ఆమెకు హిందీలో సరైన విజయం లేదు. ఆమె సౌత్ కి డైవర్ట్ అవుతుందా లేక సౌత్ & నార్త్ లో రెండు పడవల ప్రయాణం సాగిస్తుందా అనేది చూడాలి.