Devara: తారక్ లక్కీ నంబర్ మ్యాజిక్ రిపీటవుతుందా.. మేకర్స్ అలా చేయనున్నారా?

  • August 28, 2024 / 07:52 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara) రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ కానుండగా థర్డ్ సింగిల్ సైతం ప్రేక్షకుల అంచనాలను మించి ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. థర్డ్ సింగిల్ లో డ్యాన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అయితే తారక్ లక్కీ నంబర్ 9 అనే సంగతి తెలిసిందే.

Devara

తారక్ కార్లకు సైతం 9999 నంబర్ ఉంటుంది. దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27 కాగా 2+7 =9 సెంటిమెంట్ ను రిలీజ్ డేట్ విషయంలో తారక్ ఫాలో అవుతున్నారు. అదే విధంగా దేవర రిలీజ్ రోజున అర్ధరాత్రి 1 : 08 గంటల నుంచి షోలు ప్రదర్శితం కానుండగా 1+8 = 9 అనే నంబర్ సెంటిమెంట్ కూడా ఈ సినిమా విషయంలో ఫాలో అవుతున్నారనే సంగతి తెలిసిందే.

దేవర మూవీ విషయంలో తారక్ లక్కీ నంబర్ మ్యాజిక్ రిపీటవుతుందనే కామెంట్స్ వినిపిస్తుండగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. దేవర సినిమాలో నాలుగు పాటలు ఉండగా త్వరలో ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ రానున్నాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయని తెలుస్తోంది. తారక్ సెప్టెంబర్ నెల అంతా ఈ సినిమా ప్రమోషన్స్ కే పరిమితం కానున్నాడని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలన్నీ దేవరలో ఉంటాయని కొరటాల శివను ఈ సినిమా దర్శకునిగా మరో మెట్టు పైకి ఎక్కించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానున్న దేవర ఆక్యుపెన్సీ, ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సైతం రికార్ద్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.

హిందీ పుకారు సంగతి తేలలేదు.. శ్రీలీల కోలీవుడ్‌ ఛాన్స్‌ వచ్చిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus