ఇంత హఠాత్తుగా డేట్ ఎందుకు ఎనౌన్స్ చేశారో..?

‘పుష్ప’రాజ్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్ అండ్ పవర్ ఫుల్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్నాడు. రీసంట్ గా రిలీజైన పోస్టర్ లో మాస్ యాక్షన్ లుక్ లో , రఫ్ లుక్ లో రెచ్చిపోతున్నాడు బన్నీ. ఈ పోస్టర్ చూసినవాళ్లంతా బన్నీ బాడీలాంగ్వేజ్ కి, రగ్డ్ లుక్ కి ఫిదా అయిపోతున్నారు. మాసిన జుట్టు, మట్టికొట్టుకుపోయిన కాళ్లు, చేతిలో గొడ్డలి, కళ్లల్లో కసి, మెడలో కండువా, నరికిన చెట్టుపైన కూర్చున్న స్టైల్, చుట్టూ ఉన్న కూలీలు ఇలా చాలా ఇంట్రస్టింగ్ గా ఈ పోస్టర్ ని డిజైన్ చేసింది చిత్రయూనిట్. ఈ స్టిల్ తోనే ఆగష్టు 13వ తేదిన వస్తున్నట్లుగా ప్రకటించేశారు. ముందుగా ఎలాంటి పెద్ద సినిమాలు ఈ డేట్ కి ప్లాన్ చేస్కోవద్దు అంటూ హింట్స్ ఇచ్చేశారు. అయితే హఠాత్తుగా రిలీజ్ డేట్ ఎందుకు పుష్ప టీమ్ ప్రకటించింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రీసంట్ గా ట్రిబుల్ ఆర్ రిలీజ్ డేట్ పై వచ్చిన ఆంక్షలే దీనికి కారణమా అని అంటున్నారు సినీ విశ్లేషకులు. రీసంట్ గా ట్రిబుల్ ఆర్ డేట్ ని ఎనౌన్స్ చేసినపుడు బాలీవుడ్ నుంచి కొన్ని అభ్యంతరాలు వినిపించాయి. మేము ముందుగా ఎనౌన్స్ చేసిన డేట్ ని మీరు ఎలా లాక్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఈ పరిస్థితి రాకూడదనే ఇలా చేసి ఉండచ్చని అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ టైమ్ అల వైకుంఠపురములో సినిమాకి కూడా ఇదే ఇబ్బంది ఎదురైంది. మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరూ కూడా సేమ్ డేట్ ని లాక్ చేశారు. దీంతో అప్పటికప్పుడు మార్పులు చేస్కోవాల్సి వచ్చింది. ఈసారి కూడా మహేష్ బాబు సినిమా సర్కారి వారి పాట కూడా ముస్తాబవుతోంది.

అంతేకాదు, చాలా సినిమాలు ఆగష్టు ని టార్గెట్ చేస్కుని వచ్చే అవకాశం కనిపిస్తోంది కాబట్టి, ఇప్పుడు ఈ డేట్ ని లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి ఆచార్య టీజర్ ని 29న రిలీజ్ చేయబోతున్నారు. బహుశా ఆ టీజర్లో ఈ డేట్ లాక్ చేసి ఉన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే, ఇప్పుడు ఈ డేట్ ని ఎవరూ లాక్ చేయకుండా ఇంత హఠాత్తుగా పోస్టర్ ని రిలీజ్ చేసి ఉండచ్చని అంచనాలు వేస్తున్నారు సినీ తమ్ముళ్లు. మొత్తానికి రఫ్ అండ్ టఫ్ లుక్ లో బన్నీ పుష్ప రాజ్ గా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వబోతున్నట్లుగానే కనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్ చూసినవాళ్లంతా బన్నీ లుక్స్ కి ఫిదా అయిపోతున్నారు. ఏం లుక్ ఇచ్చాడ్రా బాబూ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ బాడీలాంగ్వేజ్ కి హ్యాట్సాప్ అంటున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus