డైరెక్టర్ కు అల్లు అర్జున్ డెడ్ లైన్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న చిత్రం ‘పుష్ప’. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే కథతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ , కన్నడ భాషల్లో కూడా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రం కాబట్టి ‘పుష్ప’ సినిమాలో పరభాషా నటులను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే కన్నడ నటుడు ధనుంజయ ను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతిని కూడా ఎంపిక చేసుకోవాలి అనుకున్నారు కానీ…

తరువాత కొన్ని కారణాల వలన ఆయన తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ‘పుష్ప’ విషయంలో దర్శకుడు సుకుమార్ కు అల్లు అర్జున్ డెడ్ లైన్ పెట్టాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘పుష్ప’ చిత్రాన్ని అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫినిష్ చెయ్యాలని చెప్పాడట. కావాలంటే ఎక్కువ సమయం షూటింగ్ చెయ్యడానికి కూడా సిద్ధమని.. ఎక్కువ కాలం ఈ గెటప్ ను మెయింటైన్ చెయ్యడం కూడా నా వల్ల కాదని చెప్పాడట. ఇప్పటికే బన్నీ గడ్డం, జుట్టు పెంచి చాలా స్లిమ్ అయిన సంగతి తెలిసిందే.

అయితే సుకుమార్.. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. అందుకే అతని సినిమాలు రావడానికి సంవత్సరాలు.. సంవత్సరాలు టైం పడుతుంటుంది. 2004 లో డైరెక్టర్ గా పరిచయమైన సుకుమార్ ఈ 16 ఏళ్లలో తీసింది 7 సినిమాలే అంటే ఆ విషయాన్ని ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. మరి ‘పుష్ప’ వంటి పాన్ ఇండియా సినిమా విషయంలో బన్నీ మాట సుకుమార్ వింటాడా అంటే కచ్చితంగా చెప్పలేము.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus