Allu Arjun: తర్వాత ప్రాజెక్ట్ లతో అల్లు అర్జున్ సంచలనాలు సృష్టించనున్నారా?

సినిమా ఇండస్ట్రీలో చాలా సందర్భాల్లో ఒక హీరో రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ కు మరో హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడం జరుగుతుంది. మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన పుష్ప బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా ఇప్పటికే విడుదలైన పుష్ప ది రైజ్ సంచలనాలు సృష్టించింది. పుష్ప ది రూల్ లో అంచనాలకు మించి ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది.

పుష్ప2 సినిమాకు సీక్వెల్ గా పుష్ప3 సినిమా తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నా ఈ వార్తల్లో నిజానిజాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. అయితే పుష్ప2 తర్వాత బన్నీ ప్లానింగ్ ఊహించని విధంగా ఉండబోతుందని సమాచారం. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో క్రేజీ ప్రాజెక్ట్ లను బన్నీ ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇతర స్టార్ హీరోల ప్లానింగ్ ను మించి తన సినిమాలు ఉండేలా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా.

ఇప్పటికే ఎన్నో కథలు విన్న (Allu Arjun) అల్లు అర్జున్ బెస్ట్ అనుకున్న కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ తర్వాత బన్నీ కథల ఎంపికలో ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటున్నారని తెలుస్తోంది. తర్వాత ప్రాజెక్ట్ లు సైతం కచ్చితంగా సంచలనాలు సృష్టించాలని అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యారని సమాచారం. బన్నీ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది.

అల్లు అర్జున్ సినిమాలలో సాంగ్స్ కూడా స్పెషల్ గా ఉంటాయి. ఐకాన్ స్టార్ అనే బిరుదు బన్నీకి అదృష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. తర్వాత సినిమాతో బన్నీకి హ్యాట్రిక్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మల్టీస్టారర్ లో నటించే ఛాన్స్ వస్తే బన్నీ ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus