Allu Arjun: కెరీర్ కు సంబంధించి అల్లు అర్జున్ చేస్తున్న పొరపాట్లు ఇవే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప2 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప2 సినిమా ఎప్పుడు విడుదలైనా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వస్తే ఫ్యాన్స్ బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

భారీ బడ్జెట్ సినిమాలకు సరైన రిలీజ్ డేట్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ విషయంలో పొరపాట్లు చేస్తే కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. అదే సమయంలో బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ ఇవ్వకపోవడం కూడా అభిమానులను ఎంతగానో హర్ట్ చేస్తోంది. కెరీర్ కు సంబంధించి బన్నీ పొరపాట్లు చేస్తున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాల గురించి రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

మరోవైపు బన్నీ కెరీర్ పరంగా వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. బన్నీ హీరోగా తెరకెక్కిన సినిమాలు ఈ మధ్య కాలంలో నిర్మాతలకు మంచి లాభాలను అందించాయనే సంగతి తెలిసిందే. బన్నీతో సినిమాలను నిర్మించడానికి చాలామంది ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. బన్నీ రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది.

100 కోట్ల రూపాయల రేంజ్ లో (Allu Arjun) అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులకు నచ్చే కథలను బన్నీ ఎంచుకుంటున్నారు. బన్నీకి బాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతోంది. బాలీవుడ్ డైరెక్టర్లు సైతం బన్నీతో కలిసి పని చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus