అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరు. తనని తాను మార్చుకుంటూ ఇండస్ట్రీలో ఒక స్థాయికి ఎదిగారు. బెస్ట్ డాన్సర్స్ లో ఒకరిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మొదట్లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ భజన బాగానే చేశారు. ఐతే తనకంటూ ఓ ఇమేజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడినాక.. వేదికలపై మాట్లాడటం తగ్గించారు. ఐతే ఫ్యాన్స్ ఎటూ మాట్లాడకపోతే వదలరు కాబట్టి, తప్పక… మనసొప్పక మాట్లాడేవాడు. మెగాస్టార్, పవర్ స్టార్ లను ప్రతిసారి గుర్తు చేసుకోవడం బన్నీ కి ఇష్టం లేదు. దానికి కారణం మెగా హీరో అనే ఇమేజ్ తనకు నచ్చకపోవడమే.
తనకు సపరేట్ గా అల్లు ఫ్యామిలీ హీరో… నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, నటుడు అల్లు రామలింగయ్య మనవడు అనిపించుకోవాలని తపన. అసలు చిరు స్టార్ గా ఎదగడానికి ఊతం ఇచ్చిన, ఎప్పటి నుండో గొప్పనటుడుగా పరిశ్రమలో ఉన్న అల్లు రామలింగయ్య మనవడిగా కాకుండా.. చిరు మేనల్లుడిగా గుర్తింపు పొందటం బన్నీకి రుచించడం లేదు. అందుకే తనకంటే పెద్ద స్టార్ మహేష్ సంక్రాంతి పోటీ రీత్యా మెగాస్టార్ ని ప్రీ రిలీజ్ వేడుకకు అతిధిగా పిలిస్తే.. బన్నీ మాత్రం చిరు, పవన్, చరణ్ లలో ఏ ఒక్కరిని తన వేడుకకు పిలవకుండానే ముగించాడు. వీళ్ళలో ఏ ఒక్కరు వచ్చినా..యథా ప్రకారం, భజన షురూ చేయాల్సివస్తుంది. ఇక అల్లు రామలింగయ్య అల్లుడు అనిపించుకునే స్థాయి నుండి చిరంజీవి…, చిరంజీవి మామ అల్లు రామలింగయ్య అనే స్థాయికి ఎదిగారు. తిరుగులేని శక్తిగా దశాబ్దాలు టాలీవుడ్ కింగ్ గా ఉన్న చిరంజీవి కుటుంబానికి చెందిన ఏ హీరో అయినా..మెగా హీరోనే.ఆ బ్రాండ్ నేమ్ వారి ఎదుగుదలకు ఎంతో కీలకం. బన్నీ అనుకుంటే మాత్రం అంత ఈజీగా మెగా హీరో అనే బ్రాండ్ పోతుందా..బయటపడి చెప్తే తప్పా..!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!