Allu Arjun: పుష్ప 2 సక్సెస్ వెనుక 10 ఏళ్ల స్ట్రాటజీ.. బన్నీ ప్లాన్ అదిరిందే!

Ad not loaded.

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) సినీ ప్రయాణం ఒక్కసారిగా హిందీ మార్కెట్‌లో విజృంభించినట్లు కనిపిస్తున్నా, ఇది ఒక్కసారిగా సాధ్యమైనది కాదు. పుష్ప 2: ది రూల్ (Pushpa 2) ఘన విజయం సాధించి, బన్నీ హిందీలో బిగ్ స్టార్‌గా ఎదిగినా.. దాని వెనుక చాలా కాలం కష్టం ఉందని తాజాగా నిర్మాత బన్నీ వాసు వెల్లడించారు. పుష్ప 2 బాలీవుడ్‌లో హైయెస్ట్ గ్రాస్‌ కలెక్షన్లు సాధించిన ఇండియన్‌ మూవీగా నిలవడమే కాకుండా, బన్నీని పాన్‌ ఇండియా సూపర్ స్టార్‌ జాబితాలో చేరేలా చేసింది.

Allu Arjun

అయితే బన్నీ మార్కెట్ ఈ స్థాయికి రావడం వెనుక ఆయన పట్టుదల, స్ట్రాటజీ ఎంతో కీలకంగా నిలిచిందని తెలుస్తోంది. బన్నీ వాసు మాట్లాడుతూ, “అల్లు అర్జున్ గత 10-15 సంవత్సరాలుగా తన సినిమాలను హిందీలో విడుదల చేస్తూనే ఉన్నాడు. విడుదల రేంజ్ పెద్దదా, చిన్నదా అనే పరిమితి లేకుండా నార్త్‌ ఆడియన్స్‌కి అలవాటు చేయాలని ఎంతో కృషి చేశాడు. మేం కొన్ని సినిమాలను టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, లాభనష్టాలను పట్టించుకోకుండా విడుదల చేశాం.” అని తెలిపారు.

ఈ ప్లాన్‌ ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. గతంలో బన్నీ నటించిన సరైనోడు, అల వైకుంఠపురములో, డీజే వంటి సినిమాలు హిందీలో డబ్బింగ్ రూపంలో పెద్ద విజయం సాధించాయి. యూట్యూబ్‌లో వీటి వ్యూస్‌ కోటిన్నర దాటడం కూడా బన్నీ క్రేజ్‌ను పెంచింది. కానీ సరిగ్గా పుష్ప 1 (Pushpa) రాబోయే హైప్‌కి బీజం వేసినట్లు మారింది. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో అనూహ్యంగా క్లిక్‌ అయ్యింది. థియేటర్లలో కంటే ఓటీటీలో ఇన్‌ క్రేజ్‌ ఎక్కువగా పెరిగింది.

అదే పుష్ప 2 కోసం మాస్‌ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ఇదే క్రేజ్‌ను క్యాష్‌ చేసేందుకు బన్నీ బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ చేయనున్నట్లు టాక్‌ నడుస్తోంది. బీ టౌన్‌లో ఆయన మాస్ ఇమేజ్‌ పెరుగుతుండటంతో, అక్కడి స్టార్ డైరెక్టర్స్‌ నుంచి ప్రాజెక్టుల గురించి డిస్కషన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ హిందీ మార్కెట్‌లో మరింత స్ట్రాంగ్‌గా అడుగుపెట్టాలని ప్లాన్‌ చేస్తున్నాడు.

పుష్ప ఫ్రాంచైజీ తర్వాత కూడా నార్త్‌లో తన స్థానాన్ని మరింత బలపరిచేందుకు సిద్ధమవుతున్నాడు. మొత్తానికి, ఒక్కసారిగా బాలీవుడ్‌లో బన్నీ స్టార్ అయ్యాడనుకోవడం పొరపాటే. దాని వెనుక 10-15 ఏళ్ల కృషి ఉంది. ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. ఈ హిందీ మార్కెట్‌ను నిలబెట్టుకోవడం కోసం ఇంకా ఏమేం ప్లాన్ చేస్తాడో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus