బన్నీ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..

తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తన మార్క్ ని క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్ లో తన సత్తాని చూపించబోతున్నాడు. పుష్ప సినిమాలో పుష్ప రాజ్ గా టోటల్ ఇండియాని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. నిన్న మొన్నటి దాకా ఈ సినిమా కేవలం ఐదుభాషల్లోనే రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా ఉంటుందని ముందుగానే టైటిల్ టీజర్లో చెప్పింది.

అయితే, ఇప్పుడు సినిమాకి వస్తున్న అనూహ్యమైన స్పందనని చూసి 10 భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సడెన్‌ గా ఈనిర్ణయం ఏంటంటే ఇది యూనివర్సల్ కథ కావడంతో ఈ డెసిషన్‌ తీసుకున్న చెప్తున్నారు. రట. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ రెడ్‌ శాండిల్ కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది.  ఇదే పుష్ప కథ కావడంతో సినిమాని వరల్డ్‌ వైడ్‌ అన్ని భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతానికి పది భాషల్లో సినిమాని విడుదల చేయబోతున్నారు. సినిమా పూర్తి అయ్యే సరికి మరిన్ని భాషల్లో డబ్బింగ్ చేస్తారని కూడా అంటున్నారు. ఇక మన తెలుగు సినిమాలకు ప్రపంచదేశాల్లో మంచి మార్కెట్‌ ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి చూద్దాం.. ఏ రేంజ్ లో పుష్పరాజ్ మెప్పిస్తాడు అనేది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus