ఒక్కోసారి కొంతమంది హీరోలకు ఏ సినిమాలు చేసినా కలిసి రావు. బహుశా వాళ్ళ బ్యాడ్ టైం వల్లే అనుకుంట.. వాళ్ళు చేసిన సినిమాలు విజయవంతం కావు. ఆ హీరోలు ప్లాపుల నుండీ బయటపడటానికి ఎంత టైం పడుతుందో చెప్పలేము కానీ.. కచ్చితంగా వాళ్ళు ప్లాపుల నుండీ అయితే బయటపడతారు అని చెప్పొచ్చు.’ఖుషి’ తరువాత పవన్ కళ్యాణ్ కు 10 ఏళ్ళ వరకూ ప్లాప్ లు వెంటాడాయి.ఒక్క ‘జల్సా’ హిట్ అయినా అది పవన్ రేంజ్ హిట్ మూవీ కాదని అభిమానులే చెబుతుంటారు. ఇక మహేష్ బాబుకి ‘పోకిరి’ తరువాత 5 ఏళ్ళ వరకూ ప్లాప్ లు వెంటాడాయి.
సరిగ్గా ఇలాగే అల్లు అర్జున్, రవితేజ లు కూడా ఒకానొక టైములో ప్లాప్ లను ఎదుర్కొన్నారు. అయితే ఈసారి మాత్రం వీరిద్దరికీ హ్యాట్రిక్ కాంబోలే కలిసొచ్చాయని చెప్పొచ్చు. ఎలా అంటే.. ‘సరైనోడు’ తరువాత అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం- డీజె’ మరియు ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ చిత్రాలు నిరాశపరిచాయి. ఆ క్రమంలో బన్నీ తనకి రెండు హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ తోనే సినిమా చేసాడు. అదే ‘అల వైకుంఠపురములో’. ఆ చిత్రం 2020 సంక్రాంతికి విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. బన్నీని ప్లాపుల నుండీ బయటపడేసింది. ఇక రవితేజ కూడా అంతే..!
‘రాజా ది గ్రేట్’ తరువాత సరైన హిట్టు లేని రవితేజ.. తనకి రెండు హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేనితో సినిమా చేసాడు. అదే ‘క్రాక్’. ఈ సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్’ రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇలా బన్నీ, రవితేజ లు హ్యాట్రిక్ కాంబోలతోనే ప్లాప్ ల నుండీ బయటపడటం విశేషం.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!