ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రస్తుతం కెరీర్ పరంగా కలిసొస్తోంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ అయినా అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలు బన్నీ స్థాయిని పెంచాయి. సోలో హీరోగా రికార్డ్ స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంటున్న బన్నీ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది. రజనీ కంటే బన్నీ పారితోషికం ఎక్కువ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
పుష్ప2 సినిమా బిజినెస్ లో 33 శాతం బన్నీకి రెమ్యునరేషన్ గా దక్కేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. పుష్ప2 సినిమాకు 800 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటంతో బన్నీ రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అంచనా వేయడమే కష్టమవుతోంది. రజనీకాంత్ పారితోషికం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఆ మొత్తం కంటే 50 శాతం ఎక్కువ మొత్తం బన్నీకి పారితోషికంగా దక్కుతోంది.
అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి పుష్ప2 మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పుష్ప2 మీద హైప్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. 2024 సంవత్సరం ఆగష్టు నెల 15వ తేదీన విడుదల కానున్న పుష్ప2 మూవీ కలెక్షన్ల విషయంలో కూడా సంచలనాలు సృష్టించే మూవీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
300 కోట్ల రూపాయల రేంజ్ లో బన్నీ పారితోషికం అందుకుంటే మాత్రం సంచలనం అవుతుంది. పుష్ప2 సినిమా కోసం బన్నీ పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. బన్నీ కష్టానికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 సినిమా హిందీలో రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ (Allu Arjun) భవిష్యత్తు ప్రాజెక్ట్ లు పుష్ప2 సినిమాను మించి ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!