Allu Arjun about RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్..!

నిన్న విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా సూపర్ అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఏవేవో కారణాలు చెప్పి సినిమా నిరాశపరిచింది అంటున్నారు. కానీ రాజమౌళి టేకింగ్ కోసం కచ్చితంగా ఒకసారి చూడాల్సిందే అని క్రిటిక్స్ చెప్పుకొచ్చారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ఎలా ఉన్నా.. ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా.. జనాలు మాత్రం ఈ మూవీని ఎగబడి చూడడం ఖాయమన్న సంగతి అందరికీ తెలిసిందే.

Click Here To Watch NOW

ఇది పక్కన పెడితే సెలబ్రిటీలు కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాని చూసి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్న సంగతి కూడా తెలిసిందే. నిన్న చిరంజీవి ఈ సినిమా గురించి ఆయన అభిప్రాయాన్ని తెలియజేసారు. కాగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ పై తన శైలిలో రివ్యూ ఇచ్చాడు. అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా ‘ఆర్.ఆర్.ఆర్’ పై స్పందిస్తూ.. ” ఇంత గొప్ప సినిమాని మాకు అందించినందుకు దర్శక ధీరుడు రాజమౌళికి స్పెషల్ థాంక్స్.

రాజమౌళి గారి విజన్ కు అంతా ఫిదా అయిపోయారు. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను. అలాగే మా బావ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. పెర్ఫార్మన్స్ లో అతను డైనమిక్ పవర్ హౌస్ అనాలి. అలాగే కీలక పాత్రలు పోషించిన అజయ్ దేవగన్, అలియా భట్ కూడా బాగా చేశారు. కీరవాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్, నిర్మాత డివివి దానయ్య..

సినిమా కోసం చాలా కష్టపడ్డారు అది స్క్రీన్ పై కనిపిస్తుంది.ఇక మిగతా నటీనటులకు టెక్నీషియన్లు అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఇండియా గర్వించదగ్గ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా మాకు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus